Advertisement

  • వైద్య శాఖ మంత్రిగా చేసిన జెపి నడ్డా ఇలా మాట్లాడటం తగదు .హరీష్ రావు

వైద్య శాఖ మంత్రిగా చేసిన జెపి నడ్డా ఇలా మాట్లాడటం తగదు .హరీష్ రావు

By: Sankar Sun, 21 June 2020 8:39 PM

వైద్య శాఖ మంత్రిగా చేసిన జెపి నడ్డా ఇలా మాట్లాడటం తగదు .హరీష్ రావు



తెలంగాణలో కరోనా పరీక్షలు తక్కువ సంఖ్యలో చేస్తున్నారన్న బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా వ్యాఖ్యలను మంత్రి హరీశ్ రావు తప్పుబట్టారు. నడ్డా వ్యాఖ్యలు వైద్య సిబ్బంది ఆత్మస్థైర్యాన్ని దెబ్బ తీసేలా ఉన్నాయని హరీశ్ రావు వ్యాఖ్యానించారు. దేశానికి వైద్య శాఖ మంత్రిగా పని చేసిన అనుభవం ఉన్న తమరే వైద్యులు చేస్తున్న కృషిని తక్కువ చేసి చూపడం సబబుకాదని హరీశ్ రావు సూచించారు.

దేశ సరిహద్దుల్లో పోరాడుతున్న సైనికులు.. కరోనాపై పోరాడుతున్న వైద్యులు ఒక్కటే అని కదా మనం అనుకుంటున్నది. ప్రధాని మోదీ కూడా అదే కదా చెప్తున్నారు. దేశ రక్షణ విషయంలో ప్రభుత్వాలపై విమర్శలు చేయడం అనుచితం కాదని మీరే అంటారు. సైనికుల నైతిక స్థైర్యం దెబ్బ తీస్తుందని ఉద్బోదిస్తారు. మరి కరోనా విషయంలో రాష్ట్రాలను విమర్శించడం రాజనీతి అవుతుందా?. మీకు మరో సారి విజ్ఞప్తి చేస్తున్నా.. మానవాళి మనుగడకే సవాలుగా మారిన కరోన విషయంలో రాజకీయాలు చేయడం దేశ భద్రత విషయంలో చులకనగా మాట్లడడంతో సమానం.’’ అని హరీశ్‌రావు పేర్కొన్నారు.

మరో వైపు కేంద్రం కంటే ముందే లాక్‌డౌన్‌ ప్రకటించి అమలు చేశామని ఈటల రాజేందర్ తెలిపారు. కరోనా కట్టడిలో తెలంగాణ ప్రభుత్వ తీరును ప్రశంసించిన.. కేంద్రబృందాలపై ఫిర్యాదు చేసి నీచమైన సంస్కృతి తీసుకొచ్చారని దుయ్యబట్టారు. పార్లమెంట్ ఎన్నికల్లో తాము ఆదమరిస్తే మీరు నాలుగు సీట్లు గెలిచారని, దాంతో కోతికి కొబ్బరిచిప్ప దొరికినట్లు ప్రవర్తిస్తున్నారని ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు.

Tags :

Advertisement