Advertisement

  • హార్దిక్ పాండ్యా కొడుకు ఫస్ట్ పిక్...ట్విట్టర్‌లో జోకులు

హార్దిక్ పాండ్యా కొడుకు ఫస్ట్ పిక్...ట్విట్టర్‌లో జోకులు

By: chandrasekar Sat, 01 Aug 2020 6:32 PM

హార్దిక్ పాండ్యా కొడుకు ఫస్ట్ పిక్...ట్విట్టర్‌లో జోకులు


గురువారం హార్దిక్ పాండ్యా భార్య నటాషా స్టాంకోవిచ్‌‌ పండంటి మగబిడ్డకి జన్మనిచ్చినట్లు ప్రకటించిన హార్దిక్, తాజాగా ఆసుపత్రిలో ఆ బిడ్డని తన చేతుల్లోకి తీసుకుని మురిసిపోతున్న ఫొటోని ట్విట్టర్‌లో షేర్ చేశాడు. టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య తన కొడుకు ఫొటోని అభిమానులతో పంచుకున్నాడు. దాంతో కొంత మంది అభిమానులు అతనికి అభినందనలు తెలుపుతుండగా మరికొందరు సెటైర్లు పేలుస్తున్నారు. దానికి కారణం ఏడు నెలల్లోనే హార్దిక్, నటాషాల నిశ్చితార్థం, పెళ్లి, బిడ్డ పుట్టడం జరిగిపోవడమే.

ఈ ఏడాది జనవరి 1న నటాషాని తాను నిశ్చితార్థం చేసుకున్నట్లు సోషల్ మీడియా ద్వారా ప్రకటించి కుటుంబ సభ్యులతో పాటు అభిమానుల్ని ఆశ్చర్యపరిచిన హార్దిక్ పాండ్యా.. మధ్యలో ఎలాంటి పెళ్లి కబురు వినిపించకుండానే మే 31న తాను తండ్రి కాబోతున్నట్లు ప్రకటించేశాడు. దాంతో.. అభిమానులు మరి పెళ్లి ఎప్పుడు? అని సెటైర్లు పేల్చగా మా క్రికెటర్ భలే ఫాస్ట్ అంటూ మరికొందరు వెటకారంగా జోక్‌లు పేల్చారు. కానీ ఆ సెటైర్లని హార్దిక్ పట్టించుకోలేదు.

Tags :
|
|

Advertisement