Advertisement

  • తమ కొడుకు పుట్టిన ఆసుపత్రికి , వైద్యులకు ధన్యవాదాలు చెప్పిన పాండ్య దంపతులు

తమ కొడుకు పుట్టిన ఆసుపత్రికి , వైద్యులకు ధన్యవాదాలు చెప్పిన పాండ్య దంపతులు

By: Sankar Thu, 06 Aug 2020 12:38 PM

తమ కొడుకు పుట్టిన ఆసుపత్రికి , వైద్యులకు ధన్యవాదాలు చెప్పిన పాండ్య దంపతులు



టీమిండియా ఆల్‌రౌండ‌ర్ హార్దిక్ పాండ్యా ప్రేయ‌సి న‌టాషా జూలై 30న‌ మ‌గ‌బిడ్డకు జ‌న్మ‌నిచ్చిన సంగ‌తి తెలిసిందే. ఈ సంద‌ర్భంగా ఈ ప్ర‌పంచంలోకి తమ కొడుకును తీసుకువ‌చ్చినందుకు ఆసుప‌త్రి వైద్యులకు కృత‌జ్ఞ‌త‌లు తెలుపుతూ హార్దిక్ దంప‌తులు వేడుక చేసుకున్నారు.

అయితే అంద‌రూ అనుకున్న‌ట్టుగా జూనియ‌ర్ హార్దిక్ ముంబైలో జ‌న్మించ‌లేదు. గుజ‌రాత్‌లోని ఆనంద్‌లో ఆకాంక్ష ఆసుప‌త్రిలో పుట్టాడు. సుర‌క్షితంగా అత‌డిని త‌మ చేతుల్లో ప‌ట్టిన వైద్యుల‌కు హార్దిక్ దంప‌తులు ధ‌న్య‌వావాదాలు తెలుపుతూనే, త‌మ జీవితాల్లోకి‌ అడుగు పెట్టిన బుడ్డోడికి స్వాగ‌తం ప‌లుకుతూ అదే ఆసుప‌త్రిలో సెల‌బ్రేట్ చేసుకున్నారు.

వైద్యుల స‌మ‌క్షంలో కేక్ క‌టింగ్ చేశారు. ఈ మేర‌కు ప‌లు ఫొటోల‌ను హార్దిక్ ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానుల‌తో పంచుకున్నారు. కాగా దుబాయ్‌లోని యాచ్‌లో హార్దిక్.. న‌టాషాకు త‌న ప్రేమ విష‌యం వెల్ల‌డించారు. ఆమె ప్రేమ‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌డంతో ఈ ఏడాది జ‌న‌వ‌రిలో వీరిద్ద‌రూ నిశ్చితార్థం కూడా జ‌రుపుకున్నారు. కాగా బాలీవుడ్ న‌టిగా రాణిస్తోన్న‌ న‌టాషా 'బిగ్‌బాస్ 8' రియాలిటీ షోలో పాల్గొన్నారు. ఆమె చివ‌రిసారిగా టీవీ న‌టుడు ఏలీ గోనీతో క‌లిసి 'నాచ్ బలియే 9' డ్యాన్స్ షోలో పాల్గొన్నారు

Tags :
|

Advertisement