Advertisement

  • హార్దిక్ పాండ్య వీర విధ్వంసం ...రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం

హార్దిక్ పాండ్య వీర విధ్వంసం ...రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం

By: Sankar Sun, 25 Oct 2020 9:38 PM

హార్దిక్ పాండ్య వీర విధ్వంసం ...రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం


రాజస్థాన్‌ రాయల్స్‌తో మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌ చేస్తున్న ముంబై ఇండియన్స్‌ దూకుడుగా ఆడింది..ఇరవై ఓవర్లో 195 పరుగులు చేసి రాజస్థాన్ ముందు భారీ టార్గెట్ ఉంచింది ..తొలుత పవర్‌ప్లే ఆఖరికి వికెట్‌ నష్టానికి 59 పరుగులు చేసింది. స్టార్‌ ఓపెనర్‌ క్వింటన్‌ డికాక్‌(6) తొలి ఓవర్‌లో వెనుదిరిగాడు. జోఫ్రా ఆర్చర్‌ బౌలింగ్‌లో సూపర్‌ ఫామ్‌లో ఉన్న డికాక్‌ బౌల్డ్‌ అయ్యాడు.

వన్‌డౌన్‌లో క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్‌ యాదవ్‌ , మరో ఓపెనర్ ఇషాన్ కిషన్ తో కలిసి స్కోర్ బోర్డు ను పరుగెత్తించాడు..అయితే ఇషాన్ కిషన్ ను ఒక అద్భుత క్యాచ్ తో ఆర్చర్ పెవిలియన్ కు పంపాడు ఇక ఆ తర్వాత వెంట వెంటనే సూర్య , పోలార్డ్ అవుట్ అవ్వడంతో ముంబై కష్టాలలో పడినట్లు కనిపించింది..

అదే సమయంలో క్రీజ్ లోకి వచ్చిన హార్దిక్ పాండ్య సిక్సర్లతో చెలరేగిపోయాడు..సౌరబ్ తివారి అండగా చెలరేగిన పాండ్య ఒక్కసారిగా ఇన్నింగ్స్ స్వరూపాన్నే మార్చేశాడు ..21 బంతులు ఎదుర్కొన్న పాండ్య ఏడు సిక్సర్ల సాయంతో 60 పరుగులు చేసాడు.. . హార్దిక్‌ దెబ్బకు రాజస్థాన్‌ బౌలర్లు చేతులెత్తేశారు. ముఖ్యంగా అంకిత్‌ రాజ్‌పుత్‌ తాను వేసిన 4 ఓవర్లలో 60 పరుగులు సమర్పించుకున్నాడు.

Tags :
|

Advertisement