Advertisement

  • కొడుకు సేవలో తరిస్తున్న టీమిండియా స్టార్ ఆల్ రౌండర్

కొడుకు సేవలో తరిస్తున్న టీమిండియా స్టార్ ఆల్ రౌండర్

By: Sankar Sun, 13 Dec 2020 07:48 AM

కొడుకు సేవలో తరిస్తున్న టీమిండియా స్టార్ ఆల్ రౌండర్


టీమిండియా స్టార్ అల్ రౌండర్ హార్దిక్ పాండ్య కు క్రికెట్ నుంచి కొంచెం రెస్ట్ దొరికింది ..ఆస్ట్రేలియా తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో పాండ్యకు చోటు దక్కకపోవడంతో ఇండియాకు చేరుకున్న పాండ్య ఫామిలీతో గడుపుతున్నాడు..క్రికెట్ లో ప్రత్యర్థులకు తన బ్యాట్ తో చుక్కలు చూయించిన పాండ్య, ఇప్పుడు కొడుకు సేవలో సేదతీరుతున్నారు..

ఆసీస్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌కే ఎంపికైన హార్దిక్‌ భారత్‌కు తిరిగి వచ్చేశాడు. ఇంటికి చేరుకోగానే తన బుజ్జాయి అగస్త్యకు పాలు పట్టిస్తూ సేదతీరాడు. ఆ ఫొటోను ట్విట్టర్‌లో పంచుకున్న పాండ్యా ‘జాతీయ విధుల నుంచి తండ్రి బాధ్యతల్లోకి’ అనే వ్యాఖ్యను జతచేశాడు. ఆసీస్‌తో వన్డేలు, టి20ల్లో అదరగొట్టిన పాండ్యాకు టెస్టు జట్టులో చోటు దక్కలేదు.

‘వన్డే, టి20 సిరీస్‌ ముగియగానే ఇంటికి వెళ్లేందుకే ప్రణాళికలు వేసుకున్నా. నేను వదిలి వచ్చినప్పుడు అగస్త్య 15 రోజుల పసికందు. ఇప్పుడు 4 నెలల చిన్నారి. అతన్ని చాలా మిస్‌ అయ్యా. ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్లాలా అని ఎదురు చూశా’ అని పాండ్యా పేర్కొన్నాడు.

Tags :
|
|

Advertisement