Advertisement

  • నేను ఇంత ఫామ్ లో ఉన్నానంటే దానికి వెనక ఎంతో కఠోర శ్రమ ఉంది ...హార్దిక్ పాండ్య

నేను ఇంత ఫామ్ లో ఉన్నానంటే దానికి వెనక ఎంతో కఠోర శ్రమ ఉంది ...హార్దిక్ పాండ్య

By: Sankar Wed, 02 Dec 2020 8:58 PM

నేను ఇంత ఫామ్ లో ఉన్నానంటే దానికి వెనక ఎంతో కఠోర శ్రమ ఉంది ...హార్దిక్ పాండ్య


టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్య గాయం నుంచి కోలుకున్న తర్వాత బీకరమైన ఫామ్లో ఉన్నాడు..బౌలింగ్ చేయకపోయినప్పటికీ బ్యాటింగ్ లో మాత్రం అదరగొడుతున్నాడు..తాజాగా ఆస్ట్రేలియా తో జరుగుతున్న మూడు వన్ డే ల సిరీస్ లో కూడా లోయర్ ఆర్డర్ లో బ్యాటింగ్ కు వచ్చిన పాండ్య చెలరేగిపోయాడు...

మూడు మ్యాచ్‌లు కలిపి 114 స్ట్రైక్‌ రేట్‌తో 210 పరుగులు సాధించాడు. ఇందులో 15 ఫోర్లు, 6 సిక్సర్లు ఉన్నాయి. మొదటి మ్యాచ్‌లో 375 పరుగులు భారీ లక్ష్యం కళ్ల ముందు ఉన్నా.. ఒకవైపు వికెట్లు పడుతున్నా పాండ్యా మాత్రం ఏ మాత్రం బెదరలేదు. 76 బంతుల్లోనే 7 సిక్సర్లు, 4 ఫోర్లతో 90 పరుగులు సాధించి ఔరా అనిపించాడు. రెండో మ్యాచ్‌లో 28 పరుగులే చేసినా.. మూడో మ్యాచ్‌లో మళ్లీ విజృంభించాడు, 76 బంతుల్లోనే 92 పరగులు చేసాడు...

ఆసీస్‌తో మూడో వన్డేలో మ్యాచ్‌ గెలిచిన తర్వాత హార్దిక్‌ మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు. ప్రెజంటేషన్‌ సందర్బంగా హార్దిక్‌ తన సంతోషాన్ని పంచుకున్నాడు. 'ఈరోజు సాధించిన విజయం నిజంగా అద్భుతం. ఏం చేసినా దేశం కోసమే.. నేను ఈరోజు ఇలా ఆడుతున్నానంటే దాని వెనుక పడ్డ కఠోర శ్రమ ఎంతో దాగుంది. నేను చేసిన హార్డ్‌వర్క్‌ నేడు అద్భుతమైన ఫామ్‌లో ఉండేలా చేసింది. సిరీస్‌లో నా నుంచి ఇలాంటి ప్రదర్శన రావడం చాలా ఆనందం కలిగించింది అని అన్నాడు

Tags :

Advertisement