Advertisement

  • ఎస్వీబిసి లో పోర్న్ లింక్ కలకలం ... కొనసాగుతున్న సైబర్ టీం సోదాలు

ఎస్వీబిసి లో పోర్న్ లింక్ కలకలం ... కొనసాగుతున్న సైబర్ టీం సోదాలు

By: Sankar Thu, 12 Nov 2020 7:27 PM

ఎస్వీబిసి లో పోర్న్ లింక్ కలకలం ... కొనసాగుతున్న సైబర్ టీం సోదాలు


తిరుమల ఎస్వీబిసి కార్యాలయంలో విజిలెన్స్, సైబర్ టీం సోదాలు కొనసాగుతున్నాయి. ఎడిటింగ్ విభాగంలో పనిచేస్తున్న ఉద్యోగి హార్డ్ డిస్క్ లో పూర్తిగా పోర్న్ వీడియోలను గుర్తించింది సైబర్ టీం. ఎస్వీబిసి కార్యలయంలో ఐదు హార్డ్ డిస్క్ లతో పాటు మూడు కంప్యూటర్ లను సైబర్ టీం స్వాధీనం చేసుకున్నారు.

పోర్న్ విడియో లింక్ ఘటనలో నేడో... రేపో...మరో ముగ్గురి ఉద్యోగుల పై వేటు పడే అవకాశం ఉందని అంటున్నారు. ఎస్వీబీసీలో పోర్న్‌సైట్‌ లింక్‌ కలకలం రేపింది. శతమానం భవతి కార్యక్రమానికి సంబంధించి ఓ భక్తుడు ఎస్వీబీసీకి మెయిల్‌ చేయగా తిరిగి ఆ భక్తుడికి పోర్న్‌సైట్‌ లింక్‌ పంపాడు.

ఎస్వీబీసీలోని ఓ ఉద్యోగి దీనిపై ఆ భక్తుడు టీటీడీ చైర్మెన్‌, ఈవోకు ఫిర్యాదు చేశాడు. ఘటనపై తీవ్రంగా స్పందించిన చైర్మెన్‌ వై.వి.సుబ్బారెడ్డి, ఈవో జవహర్‌రెడ్డి... విచారణకు ఆదేశించారు. ఎస్వీబీసీ ఆఫీసులో తనిఖీలు చేసిన టీటీడీ విజిలెన్స్‌, సైబర్‌ క్రైమ్‌ టీమ్‌, ఈడీపీ అధికారులు... పోర్న్‌సైట్లు చూస్తున్న ఐదుగురు ఉద్యోగుల్ని గుర్తించారు. భక్తుడికి పోర్న్‌ సైట్‌ వీడియో లింక్‌ పంపిన ఉద్యోగిని కూడా గుర్తించారు. అంతేకాకుండా... విధులు నిర్వర్తించకుండా ఇతర వీడియోలు చూస్తున్న మరో 25 మంది సిబ్బందిని కూడా గుర్తించారు.

Tags :
|

Advertisement