Advertisement

  • ఖేల్‌రత్న అవార్డు నామినేషన్ నేనే వెనక్కి తీసుకొమ్మని చెప్పా ..హర్భజన్ సింగ్

ఖేల్‌రత్న అవార్డు నామినేషన్ నేనే వెనక్కి తీసుకొమ్మని చెప్పా ..హర్భజన్ సింగ్

By: Sankar Sun, 19 July 2020 08:05 AM

ఖేల్‌రత్న అవార్డు నామినేషన్ నేనే వెనక్కి తీసుకొమ్మని చెప్పా ..హర్భజన్ సింగ్



‘రాజీవ్‌ఖేల్‌రత్న’ అవార్డు కోసం ఈ ఏడాది భారత సీనియర్‌ స్పిన్‌ బౌలర్‌ హర్భజన్‌ సింగ్‌ పేరును ప్రతిపాదించిన పంజాబ్‌ ప్రభుత్వం ఇప్పుడు దానిని ఉపసంహరించుకుంది. అయితే ఇందులో ప్రభుత్వం తప్పేమీ లేదని, వారు నిబంధనల ప్రకారమే వ్యవహరించారని భజ్జీ వివరణ ఇచ్చాడు. ‘కొంత మంది ఈ అంశాన్ని వివాదం చేయాలని చూస్తున్నారు. ఈ విషయంలో ప్రభుత్వం సరిగానే పని చేసింది.

ఖేల్‌రత్న నిబంధన ప్రకారం గత మూడేళ్ల కాలంలో అంతర్జాతీయ ప్రదర్శనను పరిగణనలోకి తీసుకోవాలి. అలా చూస్తే నాకు అర్హత లేదు. అందుకే నేనే దరఖాస్తు వెనక్కి తీసుకోమని వారికి విజ్ఞప్తి చేశాను. ప్రభుత్వం దానికి అంగీకరించింది’ అని హర్భజన్‌ వెల్లడించాడు. అయితే భారత జట్టు తరఫున 2016 మార్చిలో చివరి మ్యాచ్‌ ఆడిన హర్భజన్‌ పేరును అసలు అర్హతే లేకుండా ఇప్పుడు ఎందుకు ప్రతిపాదించారనేదే ప్రాధమిక సందేహం.

కాగా టీమిండియాకు దాదాపు దశాబ్దం పైగానే ప్రాతినిధ్యం వహించిన హర్భజన్ సింగ్ టీమిండియాకు ఒంటి చేత్తో ఎన్నో విజయాలను అందించాడు ..2001లో ఆస్ట్రేలియా తో జరిగిన టెస్ట్ సిరీస్ లో హర్భజన్ సింగ్ ప్రదర్శనను ఏ క్రికెట్ అభిమాని కూడా అంత త్వరగా మరిచిపోలేడు..కానీ ఎంతో అద్భుత స్పిన్నర్ అయినా హర్భజన్ కెరీర్లో వివాదాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి ..అయితే ఇటీవల కాలంలో యువ ఆటగాళ్ల రాకతో బజ్జి టీంలో చోటు దక్కించుకోలేకపోతున్నాడు ..ప్రస్తుతం ఐపీయల్ లో మాత్రమే బరిలో దిగుతున్న బజ్జి చెన్నై విజయాలలో కీలక పాత్ర పోషిస్తున్నాడు ..

Tags :
|

Advertisement