Advertisement

  • భారత్లోనే కాదు ..ఆస్ట్రేలియాలో కూడా పాంటింగ్ ను బోల్తా కొట్టించా ..హర్భజన్ సింగ్

భారత్లోనే కాదు ..ఆస్ట్రేలియాలో కూడా పాంటింగ్ ను బోల్తా కొట్టించా ..హర్భజన్ సింగ్

By: Sankar Mon, 06 July 2020 1:04 PM

భారత్లోనే కాదు ..ఆస్ట్రేలియాలో కూడా పాంటింగ్ ను బోల్తా కొట్టించా ..హర్భజన్ సింగ్



హర్భజన్ సింగ్ , రికీ పాంటింగ్ మధ్య పోరు రసవత్తరంగా జరిగేది ..ఇండియాతో మ్యాచ్ అంటే పాంటింగ్ ఎక్కువగా హర్భజన్ సింగ్ దాంట్లోనే అవుట్ అయ్యే వాడు ..తాను క్రికెట్ ఆడే రోజుల్లో దిగ్గజ ఆటగాడు అయినా పాంటింగ్.. హర్భజన్ సింగ్ బౌలింగ్ లో మాత్రం అంతగా రాణించలేకపోయాడు.. రిక్కీ పాంటింగ్‌తో ఆధిపత్య పోరు గురించి తాజాగా స్టార్ స్పోర్ట్స్ షో ‘క్రికెట్ కనెక్టెడ్’లో హర్భజన్ సింగ్ మాట్లాడుతూ పాంటింగ్‌ని తొలిసారి షార్జా వేదికగా వన్డేల్లో ఔట్ చేశాను.

నా బౌలింగ్‌లో అతను స్టంపౌట్ అవగా.. పెవిలియన్‌కి వెళ్తున్న అతడ్ని ఉద్దేశించి నేను ఓ పదం అన్నాను. అప్పట్లో నాకు పెద్దగా ఇంగ్లీష్ వచ్చేది కాదు. అయితే.. కొందరి నోటి నుంచి ఆ పదం విని ఉండటంతో.. వాడేశా. అది విని కోపంతో నాపైకి పాంటింగ్‌ దూసుకొచ్చాడు. కొట్టేలా నాపైకి రావడంతో.. నిజంగానే అతను నన్ను బ్యాట్‌తో కొట్టేస్తాడేమో అనిపించింది. ఆ తర్వాత కూడా పాంటింగ్‌ని చాలాసార్లు ఔట్ చేశాను. ఆ ఘటన తర్వాత పాంటింగ్.. నేను విసిరే బంతిని కాకుండా నా పేస్‌ని చూసి బ్యాటింగ్ చేసేవాడు. దాంతో.. నా పని సులువైంది. భారత్ గడ్డపైనే కాదు.. సిడ్నీలోనూ పాంటింగ్‌ని నేను బోల్తా కొట్టించగలిగా అని హర్భజన్ సింగ్ వెల్లడించాడు.

టెస్టుల్లో అగ్రశ్రేణి బ్యాట్స్‌మెన్‌గా అప్పట్లో కితాబులు అందుకున్న రిక్కీ పాంటింగ్ మొత్తంగా 168 టెస్టు మ్యాచ్‌ల్లో 51.85 సగటుతో ఏకంగా 13,378 పరుగులు చేశాడు. ఇందులో 41 సెంచరీలు కూడా ఉన్నాయి. కానీ.. హర్భజన్ సింగ్‌పై మాత్రం పాంటింగ్‌కి మెరుగైన రికార్డ్‌ లేదు. భజ్జీ బౌలింగ్‌లో 22.30 సగటుతో మాత్రమే పరుగులు రాబట్టగలిగిన పాంటింగ్.. 2001 భారత పర్యటనలో ఘోరంగా విఫలమై 5 ఇన్నింగ్స్‌ల్లో 10 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఈ ఐదు ఇన్నింగ్స్‌ల్లోనూ హర్భజన్ సింగ్‌కే అతను వికెట్ సమర్పించుకోగా.. మొత్తంగా టెస్టుల్లో 10 సార్లు అతడ్ని భజ్జీ ఔట్ చేశాడు.




Tags :
|

Advertisement