Advertisement

  • 4 కోట్లు అప్పు ఇచ్చి మోసపోయిన భారత స్టార్ ఆటగాడు

4 కోట్లు అప్పు ఇచ్చి మోసపోయిన భారత స్టార్ ఆటగాడు

By: Sankar Thu, 10 Sept 2020 2:39 PM

4 కోట్లు అప్పు ఇచ్చి మోసపోయిన భారత స్టార్ ఆటగాడు


ఇండియా వెటరన్ క్రికెటర్ హర్భజన్ ఓ బిజినెస్‌ మ్యాన్‌కు రూ.4 కోట్లు అప్పు ఇచ్చి... అతడు తిరిగి చెల్లించకపోవడంతో చెన్నై పోలీసులను ఆశ్రయించాడు.

ఈ వ్యవహారంలో సదరు వ్యాపారవేత్త ముందస్తు బెయిల్ కోసం మద్రాస్ హైకోర్టును ఆశ్రయించాడు. ఓ కామన్ ఫ్రెండ్ ద్వారా హర్భజన్‌కు జి.మహేష్ అనే బిజినెస్ మ్యాన్ 2015లో పరిచయం కాగా.. ఆ సమయంలో భజ్జీ అతడికి రూ.4 కోట్లు ఇచ్చాడు. అయితే డబ్బులు తిరిగి ఇవ్వాలని భజ్జి అడగగా..మహేష్ ఇవ్వకుండా మోసం చేసాడు. దీంతో భజ్జి తమిళనాడు పోలీసులను ఆశ్రయించి... అతనిపై ఫిర్యాదు చేసాడు.

కాగా... హర్భజన్ సింగ్ వ్యక్తిగత కారణాల వల్ల ఈ ఏడాది ఐపీఎల్‌కు దూరం అవుతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఐపీఎల్ నుంచి దూరం కావడంతో టోర్నీ ఫీజులో రూ.2 కోట్లు కోల్పోయాడు హర్భజన్.

Tags :
|

Advertisement