Advertisement

  • సూర్యకుమార్ యాదవ్‌‌ను పక్కనబెట్టడం పై ఫైర్ అయిన హర్భజన్

సూర్యకుమార్ యాదవ్‌‌ను పక్కనబెట్టడం పై ఫైర్ అయిన హర్భజన్

By: chandrasekar Tue, 27 Oct 2020 5:34 PM

సూర్యకుమార్ యాదవ్‌‌ను పక్కనబెట్టడం పై ఫైర్ అయిన హర్భజన్


భారత జట్టును ఆస్ట్రేలియా పర్యటన కోసం బీసీసీఐ సోమవారం ప్రకటించింది. కరోనా నేపథ్యంలో టెస్టులు, వన్డేలు, టీ20లకు ఒకేసారి జట్లను ప్రకటించింది. గాయపడిన రోహిత్ శర్మను ఎంపిక చేయని బోర్డు అధిక బరువు కారణంగా రిషబ్ పంత్‌పైనా వేటేసింది. ముంబై ఇండియన్స్ బ్యాట్స్‌మెన్ సూర్యకుమార్ యాదవ్‌కు చోటు దక్కకపోవడం ఆశ్చర్యం కలిగించింది. సూర్యకుమార్ యాదవ్‌‌ను పక్కనబెట్టడం పట్ల వెటరన్ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. ‘టీమిండియాకు ఎంపిక కావాలంటే సూర్యకుమార్ యాదవ్ ఇంకేం చేయాలో తెలీదు. ప్రతి ఐపీఎల్ సీజన్లో, రంజీ సీజన్లో అతడు బాగా ఆడుతున్నాడు. ఒక్కొక్కరికి ఒక్కో రూల్ ఉందనుకుంటా. సెలక్టర్లు అతడి రికార్డులను చూడాలని కోరుతున్నా’ అని హర్భజన్ సింగ్ ట్వీట్ చేశాడు.

ఈ ఐపీఎల్ సీజన్లో ముంబై ఇండియన్స్ తరఫున 11 మ్యాచ్‌లు ఆడిన సూర్య కుమార్ యాదవ్.. 31.44 యావరేజ‌్, 148.94 స్ట్రైక్ రేట్‌తో 283 రన్స్ చేశాడు. ఇందులో రెండు హాఫ్ సెంచరీలు ఉండగా అత్యధిక స్కోరు 79 నాటౌట్. సూర్య కుమార్ యాదవ్‌కు భారత టీ20 జట్టులో చోటు దక్కకపోవడం పట్ల నెటిజన్లు సైతం విస్మయం వ్యక్తం చేస్తున్నారు. భారత జట్టు ప్రకటన వెలువడగానే సూర్యకుమార్ పేరు ట్విట్టర్లో ట్రెండ్ అయ్యింది. సూర్యకుమార్ యాదవ్‌కు జట్టులో చోటు దక్కితే బాగుండేదని అభిప్రాయపడుతున్నారు. ‘భారత జట్టును ప్రకటించిన ప్రతిసారి నాన్న అన్ని వెబ్ సైట్లు చూసి.. జట్టులో నీ పేరు లేదని చెబుతుంటాడు. ఫర్వాలేదులే నాన్న అని నేను బదులిస్తుంటా’ అని ఇటీవలే సూర్యకుమార్ యాదవ్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Tags :
|
|

Advertisement