Advertisement

స్నేహితుల రోజు శుభాకాంక్షలు...Happy Friendship Day 2020....🌹🌹🌹

By: chandrasekar Thu, 30 July 2020 11:52 AM

స్నేహితుల రోజు శుభాకాంక్షలు...Happy Friendship Day 2020....🌹🌹🌹


రక్తం పంచుకుని పుట్టిన సొంతవారికి కూడా చెప్పుకోలేని విషయాలను మనం స్నేహితులతో పంచుకుంటాం. స్నేహం ఆ దేవుడిచ్చిన గొప్ప వరం. ప్రాణం కంటే ఎక్కువగా ఇష్టపడతాం. లైఫ్‌లో మంచి ఫ్రెండ్ దొరికితే చాలు జీవితాంతం సంతోషంగా బతికేయొచ్చు. కష్టం వచ్చినా.. నష్టం వచ్చినా తోడుగా ఉండే అలాంటి స్నేహాన్ని గుర్తు చేసుకొనే రోజే ఈ స్నేహితుల దినోత్సవం.

🌹 ‘‘నీ కళ్లలో కన్నీరులా జారి మనసులో భావంగా మారి నీ ఊపిరిలో శ్వాసగా చేరి.. ప్రాణం ఉన్నంత వరకు నీ స్నేహితుడిగానే ఉంటాను నేస్తమా!’’
🌹 ‘‘మరిచే స్నేహం చేయకు స్నేహం చేసి మరవకు!’’
🌹 ‘‘మోసం చేసి స్నేహం చేస్తే తప్పులేదు. కానీ, మోసం చేయడానికే స్నేహం చేయకు!!’’
🌹 ‘‘కనులు నీవి.. కన్నీరు నాది. హృదయం నీది.. సవ్వడి నాది. ఈ స్నేహబంధం మన ఇద్దరిది!’’
🌹 ‘‘వెలుతురు ఉన్నప్పుడు ఒంటరిగా నడవడం కంటే.. స్నేహితుడితో చీకట్లో నడవటం ఉత్తమం’’
🌹 ‘‘చీకటిపడితే.. మన నీడే మనల్ని వీడుతుంది కానీ, స్నేహం.. ఎప్పుడూ మనతోనే ఉంటుంది’’
🌹 ‘‘మదిలోని మంచితనానికి మరణం లేదు. ఎదురు చూసే హృదయానికి ఓటమి లేదు. అనుక్షణం తపించే స్నేహానికి అవధులు లేవు’’

happy,friendship,day  2020,wishes,brother ,స్నేహితుల, రోజు, శుభాకాంక్షలు,


🌹 ‘‘స్నేహానికి కులం లేదు.. స్నేహానికి మతం లేదు.. స్నేహానికి హోదా లేదు... బంధుత్వం కంటే గొప్పది, వజ్రం కన్నా విలువైనది స్నేహం ఒక్కటే!’’
🌹 ‘‘నువ్వు చేసిన తప్పులను నీ ముఖం మీద చెప్పి సరిచేసేవాడే నిజమైన స్నేహితుడు’’
🌹 ‘‘నేస్తమా అని పలకరించే హృదయం నీకుంటే.. నీ నేస్తానికి చిరకాలం నేను తోడుంటా..’’
🌹 ‘‘పేద, ధనిక చూడనిది.. కుల, మత భేదం లేనిది. బంధుత్వం కన్నా గొప్పది స్నేహం ఒక్కటే’’
🌹 ‘‘నువ్వు చేసిన తప్పులను నీ ముఖం మీద చెప్పి సరిచేసేవాడే నిజమైన స్నేహితుడు’’
🌹 ‘‘మీరు గాయపడితే సానుభూతి తెలిపేవారు చాలామంది ఉంటారు. కానీ, ఒక్క ఫ్రెండ్ మాత్రమే.. ఆ గాయాన్ని మరిచిపోయేలా చేస్తాడు!!’’
🌹 ‘‘మిత్రమా.. నీ బాధలన్నీ తీరుస్తానని నేను హామీ ఇవ్వలేను. కానీ, ఆ బాధల్లోనూ నేను నీకు నిరంతరం తోడుగా ఉంటానని మాత్రం హామీ ఇవ్వగలను’’
🌹 ‘‘నీ కథలన్నీ తెలిసినోడు మంచి స్నేహితుడు. ప్రతి కథలో నీతోపాటే ఉండేవాడు.. నీ బెస్ట్ ఫ్రెండ్!’’
🌹 ‘‘స్నేహం చేయడానికి తొందరపడొద్దు.. స్నేహం చేశాక ఎప్పటికీ వదలొద్దు’’
🌹 ‘‘నీ గురించి అన్నీ తెలిసిన ఏకైక వ్యక్తి, ఇప్పటికీ నిన్ను ఇష్టపడేది నీ స్నేహితుడు మాత్రమే’’
🌹 ‘‘నీ చిరునవ్వు మాత్రమే తెలిసిన మిత్రుని కన్నా.. నీ కన్నీళ్ల విలువ తెలిసిన మిత్రుడు మిన్న’’
🌹 ‘‘నీ మీద నీకే నమ్మకంలేని సమయంలో నిన్ను నమ్మినవాడే నీ మిత్రుడు’’
🌹 ‘స్నేహం అంటే భుజం మీద చేయి వేసి నడవడమే కాదు.. నీకెన్ని కష్టాలు వచ్చినా నేనున్నాని భుజం తట్టి చెప్పడం’’

happy,friendship,day  2020,wishes,brother ,స్నేహితుల, రోజు, శుభాకాంక్షలు,


🌹 ‘‘ఆపదలో అవసరాన్ని, బాధల్లో మనసుని తెలుసుకుని సహాయపడేవాడే నిజమైన స్నేహితుడు’’
🌹 ‘‘స్నేహం కోసం ప్రాణమివ్వడం కష్టమేమీ కాదు, అంతటి త్యాగం చేసే స్నేహితుణ్ని పొందడమే కష్టం’’
🌹 ‘‘F - Few, R - Relations, I - In, E - Earth, N - Never, D - Die, ఈ భూమి కొన్ని బంధాలకు ఎప్పటికీ అంతం కావు’’
🌹 ‘‘నువ్వు లేకపోతే నేను లేను అనేది ప్రేమ.. నువ్వుండాలి నీతో పాటు నేనుండాలి అనేది స్నేహం’’
🌹 ‘‘భాష లేనిది, బంధమున్నది.. సృష్టిలో అతి మధురమైనది.. జీవితంలో మనిషి మరువలేనిది.. స్నేహం ఒక్కటే!’’
🌹 ‘‘ప్రేమ స్నేహాన్ని అడిగింది.. నేనున్న చోటు నువ్వెందుకు ఉండవని. అప్పుడు స్నేహం ప్రేమతో ఇలా అంది.. ‘‘నీవు కన్నీరు మిగిల్చిన చోట నేను ప్రేమనందిస్తా!!’’
🌹 ‘‘ఒక్కోసారి ఓటమి కూడా మేలే చేస్తుంది. నిజమైన మిత్రులెవరో నీకు తెలిసేలా చేస్తుంది’’
🌹 ‘‘కలలే జీవితానికి ఆధారం.. నమ్మకమే ఆశకు మూలం.. కష్ట సుఖాలను పంచుకోవడమే స్నేహానికి బలం’’
🌹 ‘‘వంద మంది స్నేహితులు ఉండటం గొప్పకాదు.. వంద సమస్యలు తీర్చే ఒక్క మిత్రుడు ఉండటం గొప్ప’’.
🌹 ‘‘నిజమైన స్నేహం మంచి ఆరోగ్యం లాంటిది.. పోగొట్టుకొనేంత వరకూ దాని విలువ తెలుసుకోలేం’’

Tags :
|
|

Advertisement