Advertisement

  • ఇండియన్ క్రికెట్ గతిని మార్చిన బెంగాల్ టైగర్ సౌరవ్ గంగూలీ ..హ్యాపీ బర్త్ డే

ఇండియన్ క్రికెట్ గతిని మార్చిన బెంగాల్ టైగర్ సౌరవ్ గంగూలీ ..హ్యాపీ బర్త్ డే

By: Sankar Wed, 08 July 2020 06:52 AM

ఇండియన్ క్రికెట్ గతిని మార్చిన బెంగాల్ టైగర్ సౌరవ్ గంగూలీ ..హ్యాపీ బర్త్ డే



ఇండియన్ క్రికెట్ ఒక ఇరవై ఏళ్ళు వెనక్కి వెళితే ఫిక్సింగ్ కుంభకోణంలో పడి క్రికెట్ ప్రతిష్ట మొత్తం మసకబారింది ..అప్పటిదాకా ఇండియాలో క్రికెట్ అంటే పడి చచ్చిపోయేవారు..అయితే ఫిక్సింగ్ వివాదంతో ..మనం ఇంతగా అభిమానించే ఆట నిజం కాదా అని అభిమానుల మదిలో అనుమానం ..దీనితో కష్టాల్లో ఉన్న ఇండియన్ టీం ను బయటపడేసేందుకు ఒక దమ్మున్న లీడర్ కావాలి ..సచిన్ వైపు చూసారు కానీ సచిన్ అప్పటికే కెప్టెన్సీ వద్దు అని వదిలేసాడు ..అటువంటి కఠిన పరిస్థితుల్లో కెప్టెన్ గా బాధ్యతలు అందుకున్నాడు బెంగాల్ టైగర్ సౌరవ్ గంగూలీ ..ఇండియన్ క్రికెట్ లో ఉన్న అత్యంత కఠిన పరిస్థితుల్లో గంగూలీ సవాల్ స్వీకరించాడు ..

ఆపత్కాలంలో ఉన్న ఇండియన్ జట్టును ప్రస్తుతానికి ఒడ్డున పడేస్తే చాలని క్రికెట్ పెద్దలు భావించారు ..కానీ గంగూలీ ఇంకోలా భావించాడు ..అప్పటిదాకా ఇండియన్ క్రికెటర్లు ఎవరైనా ఏమైనా అంటే తిరిగి సమాధానం ఇచ్చే వారు కాదు ..కానీ గంగూలీ వచ్చాక దానిని మార్చేశాడు ..ఇండియన్ క్రికెట్ కు దూకుడు నేర్పాడు ..ప్రత్యర్థి మాట అంటే తిరిగి మాట అనే తత్వాన్ని నేర్పాడు ..కేవలం మాటల్లోనే కాదు ఆటలోను దూకుడు నేర్పించాడు ..గంగూలీ కెప్టెన్ అయ్యాక ఆస్ట్రేలియా పర్యటనలో టీం ఇండియా దాదాపు సిరీస్ గెలిచినంత పని చేసింది ..ఆ రోజుల్లో ఆస్ట్రేలియాను మన దేశంలో ఓడించడమే కష్టం అలాంటిది వాళ్ళ దేశంలో ముప్పుతిప్పలు పెట్టారు ..అంతే కాకుండా ఫ్లింటాఫ్ ముంబై లో జరిగిన ఒక వన్ డే లో గెలిచినదుకు చొక్కా విప్పితే , గంగూలీ ఇంగ్లాండ్ లో వన్ డే కప్ గెలుచుకొని ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానంలో సంబరాలు చేసుకొని ఫ్లింటాఫ్ నోరు మూయించాడు ..అది గంగూలీ అంటే ..ఇప్పుడు ఇండియన్ క్రికెట్ లో ఉన్న ఈ దూకుడు , ఈ యువ ఆటగాళ్లు రాణింపు , విదేశాలలో సిరీస్ లు గెలవడం ఇవన్నీ గంగూలీ అలవాటు చేసినవే ..

తాను నమ్మిన అతగాడి కోసం గంగూలీ ఎంతదాకా అయినా వెళ్ళేవాడు ..ఒకసారి కుంబ్లే కోసం తన కెప్టెన్సీ ని రిస్క్ లో పెట్టాడు ..మరొకసారి హర్భజన్ సింగ్ కోసం సెలెక్టర్లతో పోరాడి టీంలో చోటు ఇప్పించాడు ..తనకు అత్యంత ఇష్టమైన ఓపెనింగ్ స్థానాన్ని సెహ్వాగ్ కోసం త్యాగం చేసాడు ..యువరాజ్ , జహీర్ , నెహ్రా లాంటి యువ ఆటగాళ్ల మీద నమ్మకం ఉంచాడు ..అంతెందుకు ధోని వరుసగా నాలుగు మ్యాచ్ లలో విఫలం అయితే ఐదో మ్యాచ్ లో జట్ట్టులో నుంచి తీసేయకుండా బ్యాటింగ్ ఆర్డర్లో ప్రమోషన్ ఇచ్చి ముందుకు పంపించాడు ..ఇలా గంగూలీ చేసిన ప్రతి ఒక్కటి ఇండియన్ క్రికెట్ కు ఎంతో మేలు చేసాయి ..2003 ప్రపంచ కప్ లో టీమిండియా ఫైనల్లో ఓడినప్పటికీ , 2011 ప్రపంచ కప్ గెలిచినా జట్టులో సగం మందికి పైగా ఆటగాళ్లు గంగూలీ తయారు చేసినవారే ..

నాయకుడు ఎక్కడ ఉన్న నాయకుడే అని నిరూపిస్తూ రిటైర్మెంట్ తర్వాత పాలనా రంగంలోకి దిగిన గంగూలీ ప్రస్తుతం బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్నాడు ..అయితే ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న ఈ బెంగాల్ టైగర్ ..జీవితంలో ఇంకా ఉన్నత స్థానాలకు చేరాలని అభిమానులు కోరుకుంటున్నారు ..హ్యాపీ బర్త్ డే బెంగాల్ టైగర్ దాదా సౌరవ్ గంగూలీ ..

Tags :
|
|
|

Advertisement