Advertisement

  • ఆ బంతికి సిక్సర్ కొట్టినందుకు ధన్యవాదములు ..కార్తీక్ కు విన్నూత్న బర్త్ డే విషెస్ చెప్పిన రోహిత్

ఆ బంతికి సిక్సర్ కొట్టినందుకు ధన్యవాదములు ..కార్తీక్ కు విన్నూత్న బర్త్ డే విషెస్ చెప్పిన రోహిత్

By: Sankar Mon, 01 June 2020 4:33 PM

ఆ బంతికి సిక్సర్ కొట్టినందుకు ధన్యవాదములు ..కార్తీక్ కు విన్నూత్న బర్త్ డే విషెస్ చెప్పిన రోహిత్

దినేష్ కార్తీక్ ఎప్పుడో ధోని కంటే ముందే టీంలో స్థానం సంపాదించినప్పటికీ ఎందుకో జట్టులో మాత్రం నిలదొక్కుకోలేకపోయాడు..ప్రతిభావంతుడే అయినప్పటికీ తన ప్రతిభకు న్యాయం చేసిన సందర్భాలు చాల తక్కువ ..అయితే ఒక్క సిక్స్ మాత్రం కార్తీక్ ను మాత్రం స్టార్ను చేసింది..ఆ ఒక్క సిక్సర్తో ఇండియన్ క్రికెట్ చరిత్రలో తనకంటూ ఒక పేజీను లికించుకోగలిగాడు..అదే నిదహాస్‌ ట్రోఫీ ఫైనల్‌ మ్యాచ్‌లో బాంగ్లాదేశ్ పై కొట్టిన సిక్సర్..ఈ రోజు కార్తీక్ బర్త్ డే కావడంతో ఆ మ్యాచ్ల్లో కెప్టెన్ అయిన హిట్ మాన్ రోహిత్ శర్మ మరొకసారి ఆ సిక్సర్ను గుర్తు చేసుకున్నాడు..

ట్రోఫీ కైవసం చేసుకునేందుకు భారత్‌కు 3 ఓవర్లలో 35 పరుగులు అవసరమైన క్లిష్ట పరిస్థితుల్లో.. 8 బంతుల్లో 29 పరుగులు చేసి.. ఉత్కంఠగా సాగుతున్న మ్యాచ్‌లో చివరి బంతిని సిక్స్‌గా మలిచి ప్రేక్షకులకు గొప్ప అనుభూతి అందించాడు. ఇక నిదహాస్‌ ట్రోఫీ తర్వాత దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లాల్సి ఉన్న నేపథ్యంలో కోహ్లి జట్టుకు దూరం కాగా.. రోహిత్‌ శర్మ సారథ్య బాధ్యతలు తీసుకున్న సంగతి తెలిసిందే. అలా తన కెప్టెన్సీలో టీమిండియాకు డీకే అందించిన చిరస్మరణీయ విజయాన్ని రోహిత్‌ తన పుట్టినరోజు సందర్భంగా గుర్తుచేసుకున్నాడు..


dinesh karthik,rohit sharma,nidahas trophy,lastball six,virat kohli ,రోహిత్‌ ,కోహ్లి ,కార్తీక్, సిక్సర్,  భారత్‌, నిదహాస్‌

ఇక కార్తీక్ బర్త్ డే సందర్భంగా జట్టు సహచరులు, అభిమానుల నుంచి అతడికి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి, క్రికెటర్లు అశ్విన్‌, హర్భజన్‌ సింగ్‌ ట్విటర్‌ వేదికగా డీకేను విష్‌ చేశారు. ఇక రోహిత్ ఐపీఎల్‌లో భాగంగా తాను ముంబై ఇండియన్స్‌ జెర్సీ, దినేశ్‌ కేకేఆర్‌ జెర్సీ ధరించి ఉన్న ఫొటోను ఈ సందర్భంగా ఇన్‌స్టాలో షేర్‌ చేశాడు. ప్రస్తుతం ఐపీయల్ లో కార్తీక్ కెకెఆర్ జట్టుకు కెప్టెన్ గా ఉన్న విషయం తెలిసిందే ..


Tags :

Advertisement