Advertisement

  • విధి నిర్వహణలో భారీ వర్షాన్ని సైతం లెక్క చేయని పోలీస్

విధి నిర్వహణలో భారీ వర్షాన్ని సైతం లెక్క చేయని పోలీస్

By: Sankar Sat, 26 Sept 2020 4:37 PM

విధి నిర్వహణలో భారీ వర్షాన్ని సైతం లెక్క చేయని పోలీస్


ప్రజా జీవితంలో పోలీస్ వ్యవస్థకు ఒక ప్రముఖ స్థానం ఉంది..రాత్రి పగలు అనే తేడా లేకుండా ప్రజల రక్షణ కొరకు పోలీసులు ఎల్లవేళలా పాటుపడుతుంటారు..అందరికి సెలవులు ఉన్నప్పటికీ పోలీసులకు సెలవులు ఉండటం చాలా అరుదుగా ఉంటుంది. ఇక వర్షాలు కురిసే సమయంలో పోలీసులు అందించే సేవలు మర్చిపోలేనివి. దానికి ఓ ఉదాహరణ ఇదే.

కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ కూడలి నిత్యం వాహనాల రాకపోకలతో రద్దీగా ఉంటుంది. ఇక వర్షం కురిసింది అంటే అక్కడ వాహనాలు భారీ ఎత్తున నిలిచిపోతాయి. గంటల తరబడి ట్రాఫిక్ జామ్ అవుతుంది. శుక్రవారం సాయంత్రం హనుమాన్ జంక్షన్ లో భారీ ఎత్తున వర్షం కురిసింది. భారీ వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ఓ పోలీస్ కానిస్టేబుల్ జంక్షన్ కూడలిలో విధులు నిర్వహించాడు. ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా చేశాడు. వాహనదారులు పోలీస్ కానిస్టేబుల్ విధి నిర్వహణకు ఫిదా అయ్యారు. వారు సైతం ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా కానిస్టేబుల్ సూచనలు పాటించారు.

దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా విధులను నిర్వహించిన కానిస్టేబుల్ శ్రీనివాస్ ను ఏపీ హోంశాఖ మంత్రి సుచరిత, డీజీపీ గౌతమ్ సవాంగ్ లు అభినందనలు తెలియజేశారు. ఇక కృష్ణా జిల్లా ఎస్పీ కానిస్టేబుల్ శ్రీనివాస్ కు మెచ్చుకుంటూ సత్కరించి రివార్డును అందజేశారు.

Tags :

Advertisement