Advertisement

  • వ్యవసాయ చట్టాలను వెంటనే ఉప సంహరించుకోని పక్షంలో ఎన్డీఏ కూటమికి మద్దుతుపై పునరాలోచన: హనుమాన్‌ బేనివాల్

వ్యవసాయ చట్టాలను వెంటనే ఉప సంహరించుకోని పక్షంలో ఎన్డీఏ కూటమికి మద్దుతుపై పునరాలోచన: హనుమాన్‌ బేనివాల్

By: chandrasekar Tue, 01 Dec 2020 12:12 PM

వ్యవసాయ చట్టాలను వెంటనే ఉప సంహరించుకోని పక్షంలో ఎన్డీఏ కూటమికి మద్దుతుపై పునరాలోచన: హనుమాన్‌ బేనివాల్


కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన చట్టంపై రైతులు తీవ్ర ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చట్టంపై రాష్ట్రీయ లోక్‌తంత్రీక్‌ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు హనుమాన్‌ బేనివాల్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను వెంటనే ఉప సంహరించుకోని పక్షంలో ఎన్డీఏ కూటమికి మద్దుతుపై పునరాలోచిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

రైతులు చేపడుతున్న ఆందోళనలో కేంద్ర నూతనంగా తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకసిస్తూ సోమవారం ఆయన అమిత్‌ షాకు లేఖ రాశారు. వెంటనే నల్ల చట్టాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. కేంద్రం నూతనంగా తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలను దేశవ్యాప్తంగా రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

వీరికి వ్యతిరేకంగా వున్న చట్టాలను ఉపసంహరించాలని కోరారు. అన్నదాతలకు తీవ్ర నష్టం చేకూర్చేలా ఉన్న ఈ చట్టాలను వెంటనే ఉపసంహరించుకోవాలని ఇప్పటికే పంజాబ్‌, హర్యానాతోపాటు పలు రాష్ట్రాల రైతులు తీవ్ర నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై విపక్షాలే కాకుండా కూటమిలోని పలు పార్టీలు గుర్రుగా ఉన్నాయి.

Tags :

Advertisement