Advertisement

  • జూన్ 22 నుంచి ఎంసెట్‌ పరీక్షలకు వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లు

జూన్ 22 నుంచి ఎంసెట్‌ పరీక్షలకు వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లు

By: chandrasekar Fri, 12 June 2020 11:10 AM

జూన్  22 నుంచి ఎంసెట్‌ పరీక్షలకు వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లు


తెలంగాణలో జులై 6 నుంచి ఎంసెట్‌ పరీక్షలు ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. అయితే ఈ పరీక్షలను ఎలా నిర్వహించాలనే అంశంపై అధికారులు ఒక నిర్ణయానికి వచ్చారు.ఎంసెట్‌ ఇంజనీరింగ్‌ పరీక్ష జులై 6, 7 తేదీల్లో ఉదయం, మధ్యాహ్నం ఉంటుంది. అలాగే మళ్లీ 8వ తేదీ ఉదయం పరీక్ష నిర్వహిస్తారు. ఇక అగ్రికల్చర్‌ పరీక్షను జులై 8వ తేదీ మధ్యాహ్నం, 9వ తేదీన ఉదయం, మధ్యాహ్నం నిర్వహించనున్నారు.

జులై 7వ తేదీన సీబీఎస్‌ఈ 12వ తరగతి విద్యార్థులకు మిగిలిపోయిన పరీక్షలను సీబీఎస్‌ఈ నిర్వహిస్తోంది. అదే రోజు ఎంసెట్‌ పరీక్ష కూడా ఉన్నందున సీబీఎస్‌ఈ 12వ తరగతి విద్యార్థులకు ఇబ్బంది లేకుండా జులై 8వ తేదీన పరీక్ష రాసేలా అవకాశం ఇస్తామని ఎంసెట్‌ కన్వీనర్‌ ఆచార్య గోవర్ధన్‌ తెలిపారు. ఈ ఏడాది మొత్తం 1800 మంది సీబీఎస్‌ఈ విద్యార్థులు ఎంసెట్‌కు దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం.

halticets,for emset,examination,website,from june 22 ,జూన్,  22 నుంచి, ఎంసెట్‌, పరీక్షలకు, వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లు


ఈ ఏడాది ఎంసెట్‌ ఇంజనీరింగ్‌, అగ్రికల్చర్‌కు మొత్తం కలిపి 2,19,410 మంది దరఖాస్తు చేసుకున్నారు. గత ఏడాది కంటే ఈసారి రెండు వేలకుపైగా దరఖాస్తులు పెరిగినట్లు తెలుస్తోంది. ఎంసెట్‌ దరఖాస్తు గడువు జూన్ 10తో ముగిసింది. కానీ రూ.10,000 ఆలస్య రుసుముతో జూన్‌ 30 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. విద్యార్థులు దరఖాస్తుల్లో పొందుపరిచిన వివరాల్లో ఏవైనా తప్పులుంటే జూన్‌ 11 నుంచి 16 వరకు సవరించుకునే అవకాశం కల్పించారు. ఇక జూన్‌ 22 నుంచి జులై 3 వరకు వెబ్‌సైట్‌ నుంచి హాల్‌టికెట్లను డౌన్‌లోడ్‌ చేయవచ్చు.

Tags :

Advertisement