Advertisement

నాకు కరోనా నెగిటివ్ వచ్చింది ..హఫీజ్

By: Sankar Wed, 24 June 2020 5:01 PM

నాకు కరోనా నెగిటివ్ వచ్చింది ..హఫీజ్



పాకిస్తాన్ క్రికెట్లో కరోనా కల్లోలం లేపింది ఒకరు కాదా ఇద్దరు కాదు ఏకంగా పది మంది ఈ కరోనా బారిన పడ్డారు దీనితో ఒక్కసారిగా క్రీడా వర్గాలు ఉలిక్కిపడ్డాయి ..మరికొద్ది రోజుల్లో ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లనున్న జట్టులో ఉన్న ఆటగాళ్లకు ముందు జాగ్రత్త చర్యలుగా కరోనా టెస్ట్ లు చేయగా ఇది బయటపడింది ..అయితే ఇలా కరోనా పాజిటివ్ వచ్చిన వాళ్లలో స్టార్ ఆల్ రౌండర్ మొహమ్మద్ హఫీజ్ కూడా ఉన్నాడు ..అయితే సెకండ్ ఒపీనియన్ కోసం తన ఫామిలీ తో కలిసి సొంతంగా వేరే హాస్పిటల్ లో కరోనా టెస్ట్ చేయించుకోవడంతో ఆ టెస్టులో హఫీజ్ తో పాటు అతడి కుటుంబ సభ్యులు కూడా కరోనా నెగటివ్ గా బయటపడ్డారు .

ఇదే విషయాన్నీ హఫీజ్ అభిమానులతో పంచుకున్నాడు హఫీజ్ మాట్లాడుతూ రిపోర్ట్స్‌లో నాకు కరోనా పాజిటివ్‌ వచ్చిందని పీసీబీ బోర్డు మంగళవారం స్పష్టం చేసింది. అయితే ఈ విషయాన్ని మరోసారి దృవీకరించుకోవాలని కుటుంబసభ్యులతో కలిసి నేను మళ్లీ కోవిడ్‌-19 పరీక్షలు చేయించుకున్నా. కాగా రిపోర్ట్స్‌లో నాతో పాటు కుటుంబసభ్యులకు కూడా నెగెటివ్‌ వచ్చింది. అల్లానే మా కుటుంబాన్ని కాపాడాడు.. ఆయనే మా అందరిని సురక్షితంగా ఉంచుతాడు' అని క్యాప్షన్‌ జత చేశాడు.

ఇక కరోనా పాజిటివ్‌గా తేలినవారిలో ఒక్క వికెట్‌ కీపర్‌ రిజ్వాన్‌ మాత్రమే టెస్టు స్పెషలిస్ట్‌. అతనికి మాత్రమే తుది జట్టులోకి ఎంపికయ్యే అవకాశాలు ఉన్నాయి. మిగతా వారికి టి20ల కోసం కోలుకునేందుకు తగినంత సమయం ఉందని బోర్డు భావిస్తోంది. రిజ్వాన్‌ గైర్హాజరులో మాజీ కెప్టెన్‌ సర్ఫరాజ్‌కు అవకాశం దక్కవచ్చు. ముందు జాగ్రత్తగా నలుగురు రిజర్వ్‌ ఆటగాళ్లు బిలాల్‌ ఆసిఫ్, ఇమ్రాన్‌ బట్, మూసా ఖాన్, మొహమ్మన్‌ నవాజ్‌లను ఎంపిక చేశాము. పీసీబీ వారిని కూడా కరోనా టెస్టుల కోసం పంపించింది.' అంటూ పీసీబీ సీఈవో వసీం ఖాన్‌ పేర్కొన్నాడు. ఇంతమందికి కరోనా వచ్చినప్పటికీ షెడ్యూల్ ప్రకారమే పాకిస్తాన్ జట్టు ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్తుంది పిసిబి స్పష్టం చేసింది ..

Tags :
|
|
|

Advertisement