Advertisement

  • పేటీఎంలో వినియోగదారులకు సంబంధించిన డేటా చోరీ...భారీ మొత్తాన్ని ర్యాన్సమ్ రూపంలో చెల్లించాలని హ్యాకర్ల డిమాండ్

పేటీఎంలో వినియోగదారులకు సంబంధించిన డేటా చోరీ...భారీ మొత్తాన్ని ర్యాన్సమ్ రూపంలో చెల్లించాలని హ్యాకర్ల డిమాండ్

By: chandrasekar Tue, 01 Sept 2020 1:38 PM

పేటీఎంలో వినియోగదారులకు సంబంధించిన డేటా చోరీ...భారీ మొత్తాన్ని ర్యాన్సమ్ రూపంలో  చెల్లించాలని హ్యాకర్ల డిమాండ్


ఈ మధ్య కాలం లో online లో దొంగతనాలు, డేటాను దొంగిలించే హ్యాకర్స్ ఎక్కువవుతున్నాయి.

ఇ-కామర్స్‌ పేమెంట్‌ సిస్టం, ఫైనాన్షియల్‌ టెక్నాలజీ కంపెనీ పేటీఎంలో వినియోగదారులకు సంబంధించిన డేటా చోరీకి గురైనట్లు న్యూస్ వినబడుతోంది. సంస్థకు చెందిన పేటీఎం మాల్‌ డేటాబేస్‌పై జాన్‌ విక్‌ అనే గ్రూప్‌నకు చెందిన హాకర్లు దాడి చేసినట్లు సమాచారం.

దొంగిలించిన డేటాను తిరిగి ఇచ్చేందుకు హ్యాకర్‌ గ్రూప్‌ భారీ మొత్తాన్ని ర్యాన్సమ్‌ రూపంలో చెల్లించాలని పేటీఎంను డిమాండ్‌ చేశారని గ్లోబల్‌ సైబర్‌ ఇంటెలిజెన్స్‌ సైబిల్‌ పేర్కొంది.

డేటా చోరీ అబద్ధమని, సమాచారం సురక్షితంగా ఉందని పేటీఎం మాల్‌ ప్రతినిధి తెలియచేసారు. 'వినియోగదారులందరితో పాటు కంపెనీ డేటా కూడా సురక్షితంగా ఉంది. డేటా చౌర్యం జరిగిందన్న వార్తలపై తాము సమగ్ర దర్యాప్తు చేశామని, ఆ వార్తలు నిరాధారమని తమ పరిశీలనలో వెల్లడైంది అని తేలిపారు.

డేటా సెక్యూరిటీ కోసం భారీగా ఖర్చు పెడుతున్నాం. మాకు బగ్‌ బౌంటీ ప్రొగ్రామ్‌ కూడా ఉంది. డేటా చౌర్యానికి సంబంధించి ఎలాంటి ప్రయత్నం జరిగినా వెంటనే గుర్తించే వ్యవస్థ తమ దగ్గర ఉన్నదని' ఆయన తెలియజేసారు.

Tags :
|

Advertisement