Advertisement

ఆమె పేదల 'మదర్'..

By: Anji Sat, 29 Aug 2020 11:37 AM

ఆమె పేదల 'మదర్'..

పేదరికాన్ని అడ్డుపెట్టుకొని మతప్రచారానికి.. వచ్చిన ధెరిసా కాదు. అందుకే ఆమెకు ప్రచారం లేదు.. మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇండోర్‌కు చెందిన గైనకాలజిస్ట్‌ డాక్టర్ భక్తి యాదవ్ (91) వయసు మీద పడ్డా 69ఏళ్లుగా వైద్య వృత్తినే మానవ సేవగా భావిస్తున్నారు. ఆమె ధృఢ సంకల్పానికి వయస్సు అడ్డురాలేదు. డబ్బు కోసం ఆమె ఎప్పుడూ వెంపర్లాడలేదు. 1948నుంచి నేటి వరకు ఎన్నో వేల మందికి ఉచితంగా వైద్య చికిత్సలు అందించిన గ్రేట్ డాక్టర్.


చిన్న గాయానికి చికిత్స చేసేందుకే.. వేలకొద్ది ఫీజులు వసూలు చేసే డాక్టర్లున్న నేటి సమాజంలో.. పేదలకు ఉచితంగా చికిత్స అందిస్తూ వారి పాలిట నిజమైన దైవం అయ్యారు. 91ఏళ్ల వయసులో.. వణుకుతున్న చేతులతో ఆమె ఇప్పటికీ వైద్య చికిత్సల్లో తలమునకలై ఉన్నారంటే.. వృత్తి పట్ల ఆమె ఆరాధన, నిబద్దత ఎంత చిత్తశుద్దితో కూడుకున్నదో అర్థం చేసుకోవచ్చు.


మరో విశేషమేంటంటే.. మన దేశంలో మొదటి మహిళా ఎంబీబీఎస్ డాక్టర్‌ భక్తి యాదవ్. తన వద్దకు వైద్యం కోసం వచ్చిన గర్భిణులకు దాదాపుగా చాలా ఎక్కువ మందికి నార్మల్ డెలివరీ చేయడానికి కృషి చేస్తున్నది. మధ్యప్రదేశ్ లోని ఏజెన్సీ ప్రాంత మహిళలకు కూడా భక్తి యాదవ్ వైద్య సేవలు అందిస్తున్నారు. వైద్య చికిత్స్ కోసం ఇప్పటికీ సుదూర ప్రాంతాల నుంచి వందల మంది తరలివస్తుంటారు. ఆమె సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం అన్‌సంగ్‌ లీడర్స్‌ కేటగిరీలో భక్తి యాదవ్ కు 2017సంవత్సరానికి గాను #పద్మశ్రీ పురస్కారాన్ని అందజేసింది.

Tags :

Advertisement