Advertisement

  • ఆన్ లైన్ నేషనల్ స్పెల్ బి విజేతగా గురుగ్రాం విద్యార్థి

ఆన్ లైన్ నేషనల్ స్పెల్ బి విజేతగా గురుగ్రాం విద్యార్థి

By: Sankar Wed, 07 Oct 2020 07:04 AM

ఆన్ లైన్ నేషనల్ స్పెల్ బి విజేతగా గురుగ్రాం విద్యార్థి


కాలిన్స్‌ సంస్థ తొలిసారి నిర్వహించిన ఆన్‌లైన్‌ నేషనల్‌ స్పెల్లింగ్‌ బీ విజేతగా గురుగ్రాంకు చెందిన అర్జున్‌ నర్సింహన్‌ నిలిచారు. ఈయన ప్రస్తుతం ది శ్రీ రామ్ స్కూల్‌లో 8 వ తరగతి చదువుతున్నాడు. అక్టోబర్ 1 న జరిగిన ఈ పోటీలో మూడు ప్రాథమిక రౌండ్ల క్విజ్‌లు జరిగాయి. పాల్గొనేవారి పదజాలం, వ్యాకరణం, స్పెల్లింగ్ నైపుణ్యాలను పరీక్షించి విజేతను ఎంపికచేశారు.

6 నుంచి 8 వ తరగతికి చెందిన 10 వేల మంది విద్యార్థులలో 24 మంది టాప్ స్కోరర్లు సెమీ ఫైనల్‌కు అర్హత సాధించారు. ఫైనల్‌లో 12 రౌండ్లు కొనసాగాయి. చివరకు ది శ్రీ రామ్ పాఠశాల విద్యార్థి అర్జున్ నర్సింహన్‌ ‘ఎక్స్‌క్యూజెబుల్‌’ అనే పదాన్ని ఉచ్చరించడం ద్వారా పోటీలో విజయం సాధించాడు.

మొదటి రన్నరప్‌గా బెంగళూరులోని ఎంఈఎస్‌కేకేపీఎస్‌ కు చెందిన 6 వ తరగతి విద్యార్థి సుయాష్ మంచాలి నిలువగా.. ముంబైలోని విల్లా థెరిసా హై స్కూల్ 6 వ తరగతి విద్యార్థి మరికా కిరణ్ రెండవ రన్నరప్‌గా బహుమతి అందుకున్నారు. పోటీని తీర్పు చెప్పి, పదాల జాబితాలను తయారుచేసిన అంతర్జాతీయ ప్రచురణకర్త - కాలిన్స్ లెర్నింగ్ డాక్టర్ ఎలైన్ హిగ్లెటన్ మాట్లాడుతూ.. ప్రదర్శనలో విద్యార్థుల స్పెల్లింగ్ నైపుణ్యాలు తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని చెప్పారు.

Tags :
|

Advertisement