Advertisement

  • గుర్తుందా శీతాకాలం మూవీ పై ప్రకటన చేసిన యువ హీరో సత్యదేవ్

గుర్తుందా శీతాకాలం మూవీ పై ప్రకటన చేసిన యువ హీరో సత్యదేవ్

By: Sankar Fri, 30 Oct 2020 4:42 PM

గుర్తుందా శీతాకాలం మూవీ పై ప్రకటన చేసిన యువ హీరో సత్యదేవ్


ఇటీవల వరుసగా సినిమాలు , వెబ్ సిరీస్ లతో ఆకట్టుంటున్న హీరో సత్యదేవ్ ..తాజాగా ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకున్న సత్యదేవ్ చేస్తున్న న్యూ మూవీ గుర్తుందా శీతాకాలం..తమన్నా హీరోయిన్ గా నటిస్తుంది..ఈ సినిమా కన్నడ హిట్ మూవీ ‘లవ్ మాక్‌టైల్’కు రీమేక్.

స్వీయ నిర్మాణంలో నాగశేఖర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. జూలైలో ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన రాగా.. దీని రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ నుంచి ప్రారంభమవుతుందని అప్పట్లో చిత్ర యూనిట్ వెల్లడించారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా ఆగిపోయినట్లు వార్తలు వచ్చాయి.

దీనిపై తాజాగా హీరో సత్యదేవ్ స్పందించాడు. ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని.. చిత్రం ఆగిపోలేదని స్పష్టం చేశాడు. త్వరలోనే షెడ్యూల్ ప్లాన్ చేసుకుని చిత్రీకరణ ప్రారంభిస్తామని తెలిపాడు..

Tags :
|

Advertisement