Advertisement

మృతదేహాలతో గుంటూరు జీజీహెచ్‌

By: chandrasekar Tue, 28 July 2020 6:48 PM

మృతదేహాలతో గుంటూరు జీజీహెచ్‌


కరోనా రోజు రోజుకి అధికమై కోలుకోలేని స్థితిలో చాలామంది మరణిస్తున్నారు. ఇలా మరణాల సంఖ్య అధికమవడంతో మృతదేహాలు సంఖ్య అమాంతం మార్చూరీలో పెరిగిపోతుంది. కుటుంబంలో నలుగురికి పాజిటివ్‌ తేలితే చికిత్స తీసుకొంటూ వారిలో ఒకరు చనిపోయారు. కుటుంబసభ్యులంతా క్వారంటైన్‌లో ఉన్నారు. మరి ఎవరు ఆ మృతదేహాన్ని స్వాధీనం చేసుకోవాలి? కరోనాతో మరణించిన వారి ఖననం చాలా జాగ్రత్తగా జరగాలి. ఎన్నో నిబంధనలు దాటాలి. అంత్యక్రియలు జరపడంలోని అనివార్యమైన జాప్యం ఇది! మృతదేహాలు కొన్ని! ఇలా కారణం ఏదయినా, సకాలంలో అంత్యక్రియలు జరగని మృతదేహాలతో గుంటూరు జీజీహెచ్‌లోని మార్చురీ నిండిపోతోంది.

గుంటూరు జిల్లాలో సోమవారం ఉదయం వరకు జీజీహెచ్‌ శవాగారంలో 27 మృతదేహాలు ఉన్నాయి. కుటుంబసభ్యులు, బంధువులు క్వారంటైన్‌, కొవిడ్‌ కేర్‌ సెంటర్లు, ఆస్పత్రుల్లో ఉండటంతో ఈ మృతదేహాలను మోయడానికి ‘ఆ నలుగురు’ కూడా కరువయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించినదాని ప్రకారం సోమవారం ఉదయం నాటికి గుంటూరులో 98 మంది కరోనాతో మరణించారు. అనధికారికంగా మరో 50కి పైనే ఉండొచ్చని భావిస్తున్నారు.

ఏప్రిల్‌ నెలలో తొలి కరోనా మరణం గుంటూరు జిల్లాలో నమోదైంది. మొదట్లో కరోనా మృతదేహాల ఖననం/దహనంపై అస్పష్టత నెలకొన్నది. దాంతో స్తంభాలగరువులోని శ్మశానవాటికలో గ్యాస్‌ ద్వారా దహనం చేసేవారు. దీనిపై ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ క్రమంలోనే అంత్యక్రియల విషయంలో కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. ఖననం చేసేటట్లు అయితే 10 అడుగుల కంటే ఎక్కువ లోతు గొయ్యి తవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.

మొదట్లో 20 మంది వరకు బంధువులను అనుమతించారు. ఆ తర్వాత నలుగురు,ఐదుగురిని మాత్రమే ఆర్‌డీవో అనుమతి మేరకు చివరి చూపు చూడనిచ్చారు. ఇటీవలికాలంలో అంతిమయాత్రకు వెళ్లిన వారిలో పలువురు కరోనా వైరస్‌ బారిన పడ్డారు. దీంతో తమవారికి కడసారి వీడ్కోలు చెప్పేందుకు చాలామంది కుటుంబసభ్యులు భయపడిపోతోన్నారు. ఈ కారణాలతో జీజీహెచ్‌ మార్చూరీలో మృతదేహాల సంఖ్య పెరిగిపోతోంది.

Tags :
|
|

Advertisement