Advertisement

ఒక చేతిలో గన్ను.. మరో చేతిలో పాలు..

By: chandrasekar Sat, 06 June 2020 6:56 PM

ఒక చేతిలో గన్ను.. మరో చేతిలో పాలు..


కోవిడ్ కారణంగా వలస కూలీల‌ను తీసుకుని క‌ర్ణాట‌క నుంచి ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌కు బ‌య‌లుదేరిన శ్రామిక్ రైలు మ‌ధ్య‌ప్ర‌దేశ్‌ రాష్ట్రం భోపాల్‌లోని రైల్వే స్టేష‌న్‌లో ఆగింది. ఆ రైలులోని ఒక బోగీలో చంటిబిడ్డ‌ను ప‌ట్టుకుని కూర్చున్న శాఫియా అజ్మియా అనే మ‌హిళ తన బిడ్డ ఆకలికి ఏడుస్తున్న‌ద‌ని, ఎవరైనా పాలు తీసుకురావాలని అంద‌రినీ అర్థిస్తున్న‌ది. అయినా ఎవ్వరూ ఆమె మాట ప‌ట్టించుకోవడం లేదు.

రైల్వే ప్రొట‌క్ష‌న్ ఫోర్స్‌కు చెందిన ఇందర్ యాదవ్ అనే కానిస్టేబుల్‌ అమెను గ‌మ‌నించి పాల ప్యాకెట్ ఇచ్చేందుకు ప‌రుగు తీశాడు. అక్క‌డే ఉన్న స్టాల్‌లో పాల‌ ప్యాకెట్ తీసుకుని వెనక్కి చూసేసరికి ట్రైన్ క‌దిలింది. అది చూసిన ఇంద‌ర్ యాద‌వ్ ఒక్క క్ష‌ణం కూడా ఆల‌స్యం చేయ‌కుండా ఓ చేతిలో రైఫిల్‌, మ‌రో చేతిలో పాల ప్యాకెట్ ప‌ట్టుకుని ప‌రుగుతీశాడు.

వేగం అందుకున్న రైలుతో స‌మానంగా ప‌రుగెత్తి ఆ త‌ల్లి చేతికి పాల ప్యాకెట్ అందించాడు. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన‌ వీడియోను సాక్షాత్తూ కేంద్ర మంత్రి పీయూశ్ గోయల్ ట్వీట్ చేశారు. ''ఒక చేతిలో గన్ను.. మరో చేతిలో పాలు.. రన్నర్ ఉసెన్‌ బోల్ట్‌నే వెనక్కి నెట్టేశారు'' అని ఆ కానిస్టేబుల్‌పై ప్రశంసలు కురిపించారు.

Tags :
|
|

Advertisement