Advertisement

  • కొత్త వైరస్ విజృంభణతో అప్రమత్తమయిన గల్ఫ్ దేశాలు...

కొత్త వైరస్ విజృంభణతో అప్రమత్తమయిన గల్ఫ్ దేశాలు...

By: Sankar Wed, 23 Dec 2020 10:51 AM

కొత్త వైరస్ విజృంభణతో అప్రమత్తమయిన గల్ఫ్ దేశాలు...


కరోనా వైరస్ విషయంలో చేసిన పొరపాట్లు చేయకుండా కొత్త వైరస్ విషయంలో అన్ని దేశాలు ముందుగానే అప్రమత్తం అయ్యాయి ..బ్రిటన్ లో కొత్త వైరస్ విజృంభణ మొదలయింది అని తెలియగానే అన్ని దేశాలు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాయి..ఇప్పటికే ఇండియా బ్రిటన్ నుంచి వచ్చే విమానాలను నిషేదించింది...

తాజాగా కొత్త రకం కరోనా వైరస్‌ బ్రిటన్‌ సహా పలు దేశాల్లో విస్తరిస్తుండటంతో ఒమన్, సౌదీ అరేబియా, కువైట్‌ అప్రమత్తమయ్యాయి. అంతర్జాతీయ ప్రయాణికుల విమాన సర్వీసులపై నిషేధం విధించాయి. సోమవారం నుంచి వారంపాటు అంతర్జాతీయ విమాన సర్వీసులపై సౌదీ, ఒమన్‌ నిషేధం విధించగా జనవరి 1 వరకు ఈ నిషేధం కొనసాగుతుందని కువైట్‌ తెలిపింది.

అవసరమైతే నిషేధాన్ని మరో వారంపాటు పొడిగిస్తామని సౌదీ పౌర విమానయాన మంత్రిత్వశాఖ ఓ ప్రకటనలో తెలిపింది. సెప్టెంబర్‌ నెలాఖరు నుంచి భారత్‌ నుంచి విమాన సర్వీసులను నిలిపేసిన సౌదీ... తమ దేశం నుంచి భారత్‌ తిరిగి వెళ్లాలనుకొనే వారికి మాత్రం అనుమతించింది. తాజాగా వాటిపైనా నిషేధం విధించింది

Tags :
|

Advertisement