Advertisement

  • దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన గుజరాత్ కానిస్టేబుల్ సునీత యాదవ్ రాజీనామా

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన గుజరాత్ కానిస్టేబుల్ సునీత యాదవ్ రాజీనామా

By: Sankar Wed, 15 July 2020 5:35 PM

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన గుజరాత్ కానిస్టేబుల్ సునీత యాదవ్ రాజీనామా



కర్ఫ్యూ నిబంధనలను ఉల్లంఘించి అర్ధరాత్రి వేళ రోడ్లపైకి వచ్చిన మంత్రి కుమారుడిని నిలదీసిన మహిళా కానిస్టేబుల్ సునీతా యాదవ్.. తన ఉద్యోగానికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు. తనకు మంత్రి అనుచరుల నుంచి ముప్పు ఉన్నందున రక్షణ కల్పించాలని పోలీసు ఉన్నతాధికారులను ఆమె కోరారు. సివిల్స్ కు ప్రిపేర్ అవుతున్నానని, ఐపీఎస్ అయిన తర్వాతనే తిరిగి పోలీసు ఉద్యోగంలోకి వస్తానని ఎంతో ఆత్మస్థైర్యంతో చెప్తోంది సునీత.

ఇప్పటివరకు మీడియాలో వచ్చింది కేవలం 10 శాతం మాత్రమే, ఇంకా నా దగ్గర 90 శాతం విషయాలు ఉన్నాయి. నా రాజీనామా ఆమోదించిన తర్వాత అన్ని విషయాలను ప్రజల ముందు ఉంచుతాను. తదనంతర పరిణామాలను ఎదుర్కొనేందుకు నేను సిద్ధంగా ఉన్నాను. ఈ యుద్ధంలో నేను మరణించినా ఎలాంటి విచారం ఉండదు. సహోద్యోగులతో పాటు ఉన్నతాధికారుల నుంచి నాకు మద్దతు ఉన్నది” అని సునీతా యాదవ్ చెప్పారు.

నా పోరాటం సునీతా యాదవ్ కోసం కాదు. నా పోరాటం ఖాకీ యూనిఫాం కోసం. నాకు ఫోన్‌లో కొన్ని బెదిరింపులు వచ్చాయి. మీరు దేశం కోసం చాలా చేస్తున్నారు. మీరు ఎక్కువ కాలం జీవిస్తారని అనుకోమన్నారు. ఈ సమస్యను పరిష్కరించుకునేందుకు వారు నాకు రూ.50 లక్షలు ఇస్తామని చెప్పారు. మూడు రోజుల క్రితం కాల్ వచ్చింది. దాని తరువాత నేను పోలీసు రక్షణ కోరుతూ సూరత్ పోలీసు కమిషనర్‌ను సంప్రదించాను. ఈ కాల్ గుజరాత్ రాష్ట్రం బయటి నుంచి వచ్చినట్లుగా కనిపిస్తున్నది” అని సునీతా యాదవ్ తెలిపారు.

కాగా జూలై 8 న కర్ఫ్యూ సమయంలో మాస్క్ లు లేకుండా కారులో ప్రయాణిస్తున్న మంత్రి కుమారుడితోపాటు మరికొందరిని నిలువరించిన కానిస్టేబుల్ సునీతా యాదవ్ తో ప్రకాష్‌ వాదిస్తున్న వీడియోను సోషల్ మీడియాలో వైరల్ అయింది.

Tags :
|

Advertisement