Advertisement

  • ఇండియాలో ఫస్ట్ సీ ప్లేన్ సర్వీసులకు గుజరాత్ వేదిక...

ఇండియాలో ఫస్ట్ సీ ప్లేన్ సర్వీసులకు గుజరాత్ వేదిక...

By: chandrasekar Fri, 23 Oct 2020 3:07 PM

ఇండియాలో ఫస్ట్ సీ ప్లేన్ సర్వీసులకు గుజరాత్ వేదిక...


దేశంలోనే తొలిసారిగా సీ ప్లేన్ సర్వీసులు అహ్మదాబాద్ నుంచి మొదలు కాబోతున్నాయి. ప్రదాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రతిష్ఠాత్మక సీ ప్లేన్ సర్వీసులు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 31న ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. గుజరాత్ అహ్మదాబాద్ లోని సబర్మతీ రివర్ ఫ్రంట్ నుంచి ఇండియాలోని మొట్టమొదటి సీ ప్లేన్ టేకాఫ్ కాబోతుంది. ప్రధాని మోదీ చేతుల మీదుగా సీ ప్లేన్ సర్వీసెస్ కు శ్రీకారం చుట్టుబోతున్నారు.

అహ్మదాబాద్ లోని సబర్మతీ రివర్‌ఫ్రంట్‌ నుంచి టేకాఫ్‌ అయి నర్మదా జిల్లాలోని స్టాట్యూ ఆఫ్‌ యూనిటీకి చేరుకుంటుంది ఈ తొలి సీ ప్లేన్. సర్ధార్‌ వల్లభాయ్‌ పటేల్‌ జయంతి సందర్భంగా ఈ నెల 31న సీప్లేన్‌ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్టు గుజరాత్‌ ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. సబర్మతీ తీరం నుంచి కేవడియాలోని స్టాట్యూ ఆఫ్‌ యూనిటీ వరకూ అందుబాటు ధరలో ఎయిర్‌ కనెక్టివిటీని తొలిసారిగా ప్రారంభించనున్నామని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. దేశంలో ఇదే తొలి సీప్లేన్‌ సర్వీసు. స్పైస్‌జెట్‌ సంస్థ నిర్వహిస్తున్న ఈ సీ ప్లేన్ లో 12 మంది ప్రయాణీకులు కూర్చోవచ్చు. అహ్మదాబాద్‌ నుంచి కేవడియాకు రోజుకు నాలుగు సీ ప్లేన్ విమానాలు రాకపోకలు సాగిస్తాయి. ఒక్కొక్క టికెట్ ధరను 4 వేల 8 వందలుగా నిర్ణయించారు. అహ్మదాబాద్‌ - కేవడియా మధ్య ప్రస్తుతం నాలుగు గంటలుగా ఉన్న ప్రయాణ సమయం సీప్లేన్‌ ద్వారా గంట వరకూ తగ్గుతుంది.

Tags :

Advertisement