Advertisement

  • మేము తిరిగి ఇంటికి వెళ్తామా ..గూడూరు కరోనా కేర్ సెంటర్ లో బాధితుల ఆందోళన

మేము తిరిగి ఇంటికి వెళ్తామా ..గూడూరు కరోనా కేర్ సెంటర్ లో బాధితుల ఆందోళన

By: Sankar Sun, 09 Aug 2020 12:15 PM

మేము తిరిగి ఇంటికి వెళ్తామా ..గూడూరు కరోనా కేర్ సెంటర్ లో బాధితుల ఆందోళన



కరోనా వైరస్ బారిన పడిన వారికి పరిస్థితి దారుణంగా ఉంది ..ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లాలంటే లక్షల్లో బిల్లు కట్టలేము అనే భయంతో గవర్నమెంట్ హాస్పిటల్ లో జాయిన్ అయితే అక్కడ పరిస్థితులు చూసి మేము ఇంటికి వెళ్తామా లేదా అనే ఆందోళనలో ఉన్నారు ..

కరోనా వైరస్ బారిన పడివారికి వారికి మెరుగైన వైద్యం అందించాలని ప్రజా ప్రతినిధులు, అధికారులు ఎంత మొత్తుకుంటున్నా.. కొన్ని చోట్ల కొంత మంది వైద్య సిబ్బంది మాత్రం తమ తీరు మార్చుకోవడం లేదు. రోగులను అసలు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఓ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతి కరోనా రోగికి రోజుకు రూ. 500 వెచ్చించి భోజనం అందించాలని అధికారులను పలుమార్లు ఆదేశించారు.

కరోనా రోగులకు ఎట్టిపరిస్థితుల్లోనూ మెరుగైన వసతులు, వైద్య సదుపాయాలు కల్పించాలని సీఎం జగన్ స్పష్టం చేస్తున్నారు. అయినా కొన్ని చోట్ల మాత్రం దుర్భర పరిస్థితులు వెలుగు చూస్తూనే ఉన్నాయి. తాజాగా, నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలో ఉన్న కోవిడ్ కేర్ సెంటర్‌లో కరోనా రోగులు శనివారం నిరసన చేపట్టారు. తమను ఇక్కడ పట్టించుకునే వారే లేరని, ట్రీట్మెంట్ సరిగా లేదంటూ ఆరోపించారు. తమకు సరైన వైద్యం, పర్యవేక్షణ లేదని, కనీస వసతులు కూడా కల్పించడం లేదని మండిపడుతున్నారు.

ఈమాత్రం దానికి ఇక్కడ ఉండడం ఎందుకు? మమ్మల్ని ఇంటికి పంపిస్తే ప్రైవేటు ఆస్పత్రుల్లో చేరుతామని, లేదా ఇంటి వద్దే ఉంటూ జాగ్రత్తలు తీసుకుంటామని వారు చెబుతున్నారు. ఇలాంటి వసతులతో ఇక్కడే ఉంటే చచ్చిపోవడం ఖాయమని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వారు ఆందోళన చేస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Tags :
|

Advertisement