Advertisement

  • ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు

By: chandrasekar Mon, 25 May 2020 12:39 PM

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు


ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో సాధారణంగా కంటే ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రోజు రోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో జనం బెంబేలెత్తిపోతున్నారు. అసాధారణ రీతిలో ఉష్ణోగ్రతలు పెరిగిపోవడంతో జనం తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వృద్ధులు, పిల్లల పరిస్థితి మరీ దారుణంగా మారింది. సమశీతోష్ణ మండల వాతావరణాన్ని తలపించే హైదరాబాద్‌లోనూ భానుడి విశ్వరూపానికి జనం బెంబేలెత్తుతున్నారు. శనివారం తెలుగు రాష్ట్రాల్లో సాధారణ ఉష్ణోగ్రతల కన్నా 5 నుంచి ఆరు డిగ్రీలు ఎక్కువ నమోదయ్యాయి.

పగటిపూట గరిష్ఠ ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్‌ దాటుతుండటంతో ప్రజలు భరించలేకపోతున్నారు. ఎండలో నడిస్తే అగ్గి మీద పోసినట్లుగా విలవిల్లాడుతున్నారు. ఎండ సెగలు గత వారం రోజుల్లో పరిశీలిస్తే బాగా పెరిగాయి. ఉదయం ఏడు గంటల నుంచే ఎండ ప్రభావం కన్పిస్తోంది .ఆదివారం నుంచి మూడు రోజుల పాటు అధిక ఎండలతో పాటు వడగాలులు వీస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారి రాజారావు సూచించారు.

growing,temperatures,andhra pradesh,telangana,heat ,ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పెరుగుతున్న, ఉష్ణోగ్రతలు, ఎక్కువ


మధ్యప్రదేశ్‌ నుంచి తెలంగాణ వరకూ 900 మీటర్ల ఎత్తున ఉపరితల ద్రోణి ఏర్పడిందని, ఈ ప్రభావంతో అక్కడక్కడ ఉరుములు, గాలులతో వర్షాలు పడే అవకాశాలున్నాయన్నారు. ప్రస్తుతం సాధారణంకన్నా 6 డిగ్రీల వరకూ అదనంగా ఉష్ణోగ్రతలు ఉంటున్నాయి. శనివారం అత్యధికంగా జగిత్యాల జిల్లా ఈ.రాజారాంపల్లిలో 47.2, పెద్దపల్లి జిల్లా శ్రీరాంపూర్‌లో 47 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. శనివారం నెల్లూరు జిల్లా కసుమూరులో 47.5 డిగ్రీలు, ప్రకాశం జిల్లా కురిచేడులో 47 డిగ్రీలు, కర్నూలు జిల్లా యనకండ్లలో 47 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయినది.

విశాఖ, విజయవాడ నగరాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. తీవ్రమైన ఉక్కపోతతో జనం ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎండలు తీవ్రంగా ఉండటంతో వాహనాల్లో శానిటైజర్లు తీసుకెళ్లేవారు జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రకాశం జిల్లాలో వడదెబ్బకు ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.

growing,temperatures,andhra pradesh,telangana,heat ,ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పెరుగుతున్న, ఉష్ణోగ్రతలు, ఎక్కువ


ప్రకాశం జిల్లా పొన్నలూరు అంబేడ్కర్‌ నగర్‌కు చెందిన కసుకుర్తి కోటయ్య(72) వడదెబ్బకు గురై మృతి చెందాడు. శనివారం మధ్యాహ్నం ఎండ తీవ్రతకు తట్టుకోలేక తీవ్ర అస్వస్థతకు గురయిన ఆయన్ను కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించే లోపే ప్రాణాలు కోల్పోయాడు. దారకానిపాడుకు చెందిన సి.నరసమ్మ(65) వడదెబ్బతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. నరసమ్మ శుక్రవారం ఎండలోనే బ్యాంకుకు వెళ్లి రావడంతో వడదెబ్బకు గురయ్యారని, శనివారం ఎండ తీవ్రతను తట్టుకోలేక చనిపోయినట్లు తెలియజేసారు.

Tags :

Advertisement