Advertisement

బీకాం కోర్సులకు పెరుగుతున్న ఆదరణ...

By: chandrasekar Wed, 16 Dec 2020 3:55 PM

బీకాం కోర్సులకు పెరుగుతున్న ఆదరణ...


బీకాంతో పోలిస్తే బీఎస్సీ కోర్సులకు క్రమంగా ఆదరణ తగ్గుతున్నది. 2018లో 90,786 మంది బీఎస్సీ కోర్సుల్లో చేరారు. ఈ ఏడాది 86,642 మంది చేరగా అప్పటి కన్నా 4,144 అడ్మిషన్లు తగ్గాయి. డిగ్రీ అడ్మిషన్ల వివరాలను అధికారులు ప్రకటించారు. రాష్ట్రంలో మార్కెటింగ్‌ రంగం విస్తరించడంతో ఉద్యోగ అవకాశాలు మెరుగుపడ్డాయని, ఈ కారణంగా బీకాం కోర్సులకు డిమాండ్‌ పెరుగుతున్నదని పలువురు కామర్స్‌ ప్రొఫెసర్లు చెప్తున్నారు. డిగ్రీ కోర్సుల్లో బీకాంకు భారీ డిమాండ్‌ పెరిగింది. 2020-2021 విద్యాసంవత్సరానికి 85,691 మంది సీట్లు పొందారు. గత ఏడాది కన్నా 11,975 మంది అదనంగా ఈ కోర్సులో చేరడం విశేషం.

రాష్ట్రంలో 2020-2021 విద్యాసంవత్సరానికి గాను 4.50 లక్షల డిగ్రీ సీట్లు అందుబాటులో ఉండగా 2,12,429 భర్తీ అయినట్టు వివరించారు. అందులో బాలురు 1,07,898, బాలికలు 1,04,531 ఉన్నట్టు తెలిపారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో చేరేందుకు విద్యార్థులు అధిక ఆసక్తిని కనబర్చారు. మునుపెన్నడూ లేని విధంగా ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో 59,269 మంది చేరారు. అదే విధంగా ఈ సారి పాలిటెక్నిక్‌ కాలేజీల్లో డిప్లొమా కోర్సుల్లో దోస్త్‌ ద్వారా 607 మంది విద్యార్థులు ప్రవేశాలు పొందారు.

Tags :
|

Advertisement