Advertisement

  • మళ్లీ పెరుగుతున్న కరోనా...కరోనా ముప్పు తప్పించుకోవాల౦టే మాస్క్‌లు తప్పనిసరి: వైద్యారోగ్యశాఖ

మళ్లీ పెరుగుతున్న కరోనా...కరోనా ముప్పు తప్పించుకోవాల౦టే మాస్క్‌లు తప్పనిసరి: వైద్యారోగ్యశాఖ

By: chandrasekar Wed, 02 Dec 2020 5:02 PM

మళ్లీ పెరుగుతున్న కరోనా...కరోనా ముప్పు తప్పించుకోవాల౦టే మాస్క్‌లు తప్పనిసరి: వైద్యారోగ్యశాఖ


మళ్లీ కొవిడ్‌ కేసులు పెరగుతున్నాయి.. మాస్క్‌లు ధరించి, శానిటైజర్లు వాడి కరోనా ముప్పు తప్పించుకోవాలని తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం సూచిస్తున్నది.. ఇప్పటికే మొబైల్‌ వాహనాల ద్వారా పల్లెలు, పట్టణాల్లో కరోనా పరీక్షలు చేయిస్తున్నది. వైద్యారోగ్యశాఖ ద్వారా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, ఏమాత్రం అశ్రద్ధ వహించొద్దని విజ్ఞప్తి చేస్తున్నది.. ఆరోగ్య సమస్యలపై సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నది. ప్రపంచాన్ని గడగడలాడించిన కొవిడ్‌ గత కొంతకాలంగా తగ్గుతూ వచ్చినా మళ్లీ చలికాలం కావడంతో కేసులు మరింత పెరుగుతూ వస్తున్నాయి. మార్చి 22న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జనతా కర్ఫ్యూ, 23వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ను విధించి కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా కట్టడి చేశారు. దీంతో కేసులు కొంత మేర తగ్గుతుండటంతో లాక్‌డౌన్‌లో సడలింపులు ఇచ్చింది. జనజీవనాన్ని యథాస్థితికి తీసుకువచ్చే ప్రయత్నం చేశారు. ప్రభుత్వం, వైద్యారోగ్యశాఖ అప్రమత్తంగా ఉంటూనే అన్ని రంగాలను గాడిలో పెట్టేందుకు ఒక్కొక్కటిగా సడలింపులు ఇస్తూ మాములు జీవనం గడిపేలా చర్యలు తీసుకున్నారు. దీంతో జనజీవనం సాధారణ స్థితికి వచ్చి అన్నిరంగాలు ఇప్పుడిప్పుడే కుదుటపడి, ఆర్థ్ధిక వ్యవస్థ కూడా చక్కబెట్టేందుకు ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటూ వస్తుంది.

ఈ క్రమంలో దసరా, దీపావళి పండుగలతో పాటు చలికాలం కూడా రావడంతో కరోనా‌ కేసులు పెరుగుతూ వస్తున్నాయి. దీంతో ప్రతిఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని భౌతికదూరం పాటిస్తూ, మాస్కులు ఖచ్చితంగా ధరించాలని, శానిటైజర్‌ వెంట ఉంచుకుంటూ జాగ్రత్తలు పాటించాలని సీఎం కేసీఆర్‌ ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని పిలుపునిచ్చారు. కరోనా సెకండ్‌ వేవ్‌ ప్రారంభమైందని కొన్ని దేశాలు ప్రకటిస్తున్న తరుణంలో ప్రతిఒక్కరూ గతంలో మాదిరిగానే అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ తమ జీవనాన్ని సాగించాలని ప్రభుత్వం సూచిస్తోంది. కరోనా సెకండ్‌ వేవ్‌ మొదలయ్యే అవకాశాలు ఉన్నాయని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి కరోనా కట్టడికి సహకరించాలని సీఎం కేసీఆర్‌ ఇటీవల మీడియా సమావేశంలో కోరడంతో వైద్యారోగ్యశాఖ అవసరమైన చర్యలను చేపట్టింది. తొలి దశలో ఏ విధమైన జాగ్రత్తలు తీసుకున్నారో అంతేకంటే రెట్టింపుగా జాగ్రత్తలు తీసుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. వాతావరణం చల్లగా ఉండటంతో కరోనా వైరస్‌ విజృభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వైద్యాధికారులు చెబుతున్నారు. దగ్గు, జలుబు, తలనొప్పి, జ్వరం, ఒళ్ళునొప్పులు, గొంతునొప్పి ఉన్నట్లయితే తప్పనిసరిగా కరోనా టెస్టులు చేయించుకొని ముందుస్తుగా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచిస్తున్నారు.

Tags :
|

Advertisement