Advertisement

  • సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకొని ఒక యువ ఎస్సై ఆత్మహత్య

సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకొని ఒక యువ ఎస్సై ఆత్మహత్య

By: Sankar Sat, 29 Aug 2020 09:39 AM

సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకొని ఒక యువ ఎస్సై ఆత్మహత్య


ప్రజలకు ఎంతో సేవ చేయాలనీ పోలీస్ డిపార్ట్మెంట్ లో చేరిన ఓ యువ ఎస్సై , ఎంతో ఉజ్వల భవిష్యత్తు ఉన్నప్పటికీ హఠాత్తుగా ఆత్మహత్య చేసుకున్న సంఘటన విశాఖపట్నం లో కలకలం రేపింది..కాపులుప్పాడ గ్రేహౌండ్స్ విభాగంలో ఎస్సైగా పనిచేస్తున్న షణ్ముఖరావు తన సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని ప్రాణాలు తీసుకున్నారు.

శుక్రవారం రాత్రి సుమారు 7 గంటల సమయంలో విధుల్లో ఉండగానే నొప్పి ఎక్కువగా ఉందని తోటి సిబ్బందికి చెప్పిన ఆయన, 7.30 గంటలకు భోజనం చేసి... 8 గంటల సమయంలో సర్వీసు రివాల్వర్‌తో కాల్చుకున్నారు. ఆయన గత కొన్ని నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఈ అనారోగ్య కారణంగానే ఆత్మహత్య చేసుకున్నారని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. డెడ్‌బాడీని పోస్ట్‌మార్టమ్ కోసం ఆస్పత్రికి తరలించారు.

ఆత్మహత్యకు అనారోగ్య మే కారణమా.. ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కుటుంబ సభ్యుల్ని అడిగి మరిన్ని వివరాలు సేకరించే పనిలో ఉన్నారు పోలీసులు.

Tags :
|

Advertisement