Advertisement

  • ఇరు రాష్ట్రాల ప్రయాణికులకు గుడ్ న్యూస్ ...నేటి రాత్రి నుంచే ఏపీ - తెలంగాణ మధ్య బస్సులు

ఇరు రాష్ట్రాల ప్రయాణికులకు గుడ్ న్యూస్ ...నేటి రాత్రి నుంచే ఏపీ - తెలంగాణ మధ్య బస్సులు

By: Sankar Mon, 02 Nov 2020 7:08 PM

ఇరు రాష్ట్రాల ప్రయాణికులకు గుడ్ న్యూస్ ...నేటి రాత్రి నుంచే ఏపీ - తెలంగాణ మధ్య బస్సులు


తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల మధ్య నిలిచిపోయిన ఆర్టీసీ బస్సు సర్వీసులు తిరిగి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ఇరు రాష్ట్రాల మధ్య ఒప్పందం కుదిరింది. మంత్రి పువ్వాడ అజయ్‌ సమక్షంలో అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులపై ఇరు రాష్ట్రాల అధికారులు సంతకాలు చేశారు.

ఏపీలో తెలంగాణ ఆర్టీసీ 1,61,258 కి.మీ మేర బస్సు సర్వీసులను నడపనుంది. తెలంగాణలో ఏపీఎస్‌ఆర్టీసీ 1,60,999 కి.మీ నడపనుంది. కాగా.. ఏపీలో తెలంగాణ ఆర్టీసీ బస్సులను తిప్పనుంది. ఇక ఏపీఎస్‌ఆర్టీసీ తెలంగాణకు 638 బస్సులు నడపనుంది. విజయవాడ రూట్‌లో 273 తెలంగాణ ఆర్టీసీ బస్సులు నడవనున్నాయి.

కర్నూలు- హైదరాబాద్‌ రూట్‌లలో 213 బస్సులను తెలంగాణ ఆర్టీసీ నడపనుంది. తక్షణమే ఈ ఒప్పందం అమలులోకి వస్తుందని అధికారులు వెల్లడించారు. దీంతో ఈ అర్ధరాత్రి నుంచి ఇరు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ సర్వీసులు నడవనున్నాయి.

Tags :
|

Advertisement