Advertisement

గ్రీన్ దీపావళికే ఓట్ వేసిన గ్రేటర్ వాసులు

By: Sankar Mon, 16 Nov 2020 08:39 AM

గ్రీన్ దీపావళికే ఓట్ వేసిన గ్రేటర్ వాసులు


ప్రతి దీపావళి పండుగకు గ్రేటర్‌లో మూడురెట్ల చొప్పున కాలుష్యం పెరుగుతున్నది. అయితే ఈ సారి అంతగా పెరుగలేదని కాలుష్య నియంత్రణమండలి అధికారులు అభిప్రాయపడుతున్నారు.

కాలుష్య తీవ్రతలను గమనిస్తే ముఖ్యంగా వాయుకాలుష్యం పెరుగుదలలో పెద్దగా మార్పులేమిలేవని అధికారులు అంటున్నారు. కరోనా పరిస్థితుల దృష్ట్యా చాలా మంది పటాకులు కాల్చేందుకు ఆసక్తిచూపలేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. గతంతో పోల్చితే ఈ ఏడాది పటాకుల అమ్మకాలు సైతం గణనీయంగా తగ్గినట్లుగా మార్కెట్‌ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

వాస్తవికంగా పండుగకు రెండు రోజుల ముందు, పండుగ తర్వాత ఒక రోజు నగరమంతా భారీగా పటాకులను పేల్చడం అనవాయితీగా వస్తున్నది. ఈ రెండు రోజుల పాటు పెద్ద ఎత్తున శబ్దాలు వినిపిస్తాయి. కాని ఈ సారి కొనుగోళ్లు అంతగా జరుగలేదని, ఒక్క దీపావళి పండుగ రోజు మాత్రమే కాల్చడానికి జనం ఆసక్తిచూపినట్లుగా వ్యాపారులు అంటున్నారు. కొనుగోళ్లు మందగించడం, పర్యావరణంపై అవగాహన పెరుగడంతో కాలుష్యం తగ్గినట్లుగా తెలుస్తున్నది.

Tags :

Advertisement