Advertisement

  • గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్‌ ఎన్నికలకు సంబంధించి తెలంగాణ హైకోర్టు కీలకమైన సూచన

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్‌ ఎన్నికలకు సంబంధించి తెలంగాణ హైకోర్టు కీలకమైన సూచన

By: chandrasekar Thu, 03 Dec 2020 11:52 PM

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్‌ ఎన్నికలకు సంబంధించి తెలంగాణ హైకోర్టు కీలకమైన సూచన


గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్‌ ఎన్నికలకు సంబంధించి తెలంగాణ హైకోర్టు కీలకమైన సూచన చేసింది. జీహెచ్ఎంసీ పరిధిలోని ఝాన్సీ బజార్‌, పురానాపూల్‌ డివిజన్లలో ఎన్నికలు తిరిగి నిర్వహించే అంశాన్ని పరిశీలించాలని రాష్ట్ర ఎన్నికల సంఘానికి (ఎస్ఈసీ) ధర్మాసనం సూచించింది. పురానాపూల్‌, ఝాన్సీ బజార్‌ డివిజన్లలో రీ పోలింగ్‌ నిర్వహించాలని అక్కడి బీజేపీ అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్ను దాఖలు చేయడం జరిగింది. ఆ రెండు డివిజన్లలో ఎంఐఎం పార్టీ అభ్యర్థులు బూత్ లో రిగ్గింగ్‌కు పాల్పడ్డారని, అందుకే మళ్లీ ఎన్నికలు జరిపించాలని బీజేపీ కోరింది. దీంతో రీ పోలింగ్‌ నిర్వహించే అంశాన్ని పరిశీలించాలని ఎన్నికల సంఘానికి హైకోర్టు సూచించడం జరిగింది. అయితే శుక్రవారమే ఎన్నికల కౌంటింగ్ ఉండడంతో ఈ అంశంపై ఎన్నికల సంఘం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారిందని తెలుస్తుంది.

ఇది ఇలా ఉంటే మరోవైపు జీహెచ్‌ఎంసీ ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెలువడ్డాయి. ఎన్నికల కోడ్ గురువారం సాయంత్రం 6 గంటలకు ముగియడంతో సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్స్ ప్రకటించారు. ఎగ్జిట్‌పోల్స్ ప్రకారం గ్రేట‌ర్ పీఠాన్ని నగరవాసులు గులాబీ పార్టీకే క‌ట్టబెడుతున్నట్లు స్పష్టం అవుతోందని తెలుస్తుంది. థ‌ర్డ్ విజ‌న్ అనే సంస్థ స‌ర్వే ప్రకారం టీఆర్ఎస్ పార్టీకి 95-101 డివిజ‌న్లలో గెలిచే అవ‌కాశం ఉంది. ఎంఐఎం 35-38, బీజేపీ 5-12, కాంగ్రెస్ 0-1 సీట్లు సాధించే అవ‌కాశం ఉన్నట్లు తెలుపుతుంది. సీపీఎస్ స‌ర్వే ప్రకారం టీఆర్ఎస్ కు 82 -96, బీజేపీ 12-20, ఎంఐఎం 32-38, కాంగ్రెస్ 3-5 స్థానాలు గెలుపొందే అవ‌కాశం ఉన్నట్లు చెపుతుంది. పీపుల్స్ ప‌ల్స్ స‌ర్వే ప్రకారం టీఆర్ఎస్ 68 -78, బీజేపీ 25-35, ఎంఐఎం 38-42, కాంగ్రెస్ 1-5 స్థానాల్లో గెలిచే అవ‌కాశం ఉన్నట్లు వివరిస్తుంది. మరి ఎవరు ఎన్నికల్లో గెలుస్తారో కచ్చితంగా తెలియాలంటే కౌంటింగ్ వరకు ఆగాల్సిందే.

Tags :

Advertisement