Advertisement

  • అర్ధరాత్రి రోడ్డు మరమత్తు పనులను దగ్గరుండి పరిశీలించిన హైదరాబాద్ మేయర్

అర్ధరాత్రి రోడ్డు మరమత్తు పనులను దగ్గరుండి పరిశీలించిన హైదరాబాద్ మేయర్

By: Sankar Wed, 04 Nov 2020 4:06 PM

అర్ధరాత్రి రోడ్డు మరమత్తు పనులను దగ్గరుండి పరిశీలించిన హైదరాబాద్ మేయర్


గ్రేటర్ హైదరాబాద్ లో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న రోడ్లకు మంత్రి కేటీఆర్ ఆదేశాలతో వేగంగా మరమ్మతు పనులు జరుగుతున్నాయని నగర మేయర్ బొంతు రామ్మోహన్ తెలిపారు. మంగళవారం అర్థరాత్రి లక్డికాపూల్ పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న రోడ్డు మరమ్మతు పనులను మేయర్ స్వయంగా పరిశీలించారు.

ఈ సందర్భంగా మేయర్ బొంతు రామ్మోహన్ మాట్లాడుతూ...వర్షాలకు దెబ్బతిన్న రోడ్లకు ఈ నెలాఖరులోగా మరమ్మతులు పూర్తి చేయాలని మంత్రి ఆదేశాలతో మెయిన్ రోడ్లు, గల్లీ రోడ్లు, సిసి రోడ్లను ఏకకాలంలో మరమ్మతులు చేయాలని అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ ప్రజలు ఇబ్బంది పడకుండా సంబంధిత ఏజెన్సీలు, ఇంజనీర్లు రోడ్డు మరమ్మతు పనులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు.

ట్రాఫిక్ నిబంధనల ప్రకారం అర్థరాత్రి నుండి తెల్లవారుజామున 6 గంటలకు జరిగే రోడ్డు మరమ్మతు పనులలో నాణ్యత లోపించకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత ఏజెన్సీలకు సూచించారు. ఈ పునరుద్దరణ పనులను ఆయా ప్రాంతాలలో ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, అధికారులు నాణ్యతలో లోపం లేకుండా తనిఖీలు చేపట్టాలని తెలిపారు. ఎక్కడ పాట్ హోల్స్ పడినా 24 గంటల వ్యవధిలోనే మరమ్మతులు చేపట్టి రవాణా సాఫిగా జరిగే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

Tags :
|
|

Advertisement