Advertisement

  • అమెజాన్ లో ఈ నెల 17 నుంచి నెల రోజుల పాటు 'గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2020' సేల్

అమెజాన్ లో ఈ నెల 17 నుంచి నెల రోజుల పాటు 'గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2020' సేల్

By: chandrasekar Thu, 08 Oct 2020 09:19 AM

అమెజాన్ లో ఈ నెల 17 నుంచి నెల రోజుల పాటు 'గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2020'  సేల్


ఈసారి అమెజాన్ లో ఈ నెల 17 నుంచి నెల రోజుల పాటు 'గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2020' సేల్ నిర్వహించనుంది. ఈ-కామర్స్ దిగ్గజ సంస్థ అమెజాన్ మరో భారీ సేల్‌కు తెరలేపేందుకు సిద్ధమైంది. పండుగ సీజన్‌ను పురస్కరించుకుని ఈ నెల 17 నుంచి ‘గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2020’ సేల్‌ను ప్రారంభించనుంది. అదే సమయంలో మరో దిగ్గజ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ కూడా ‘బిగ్ బిలియన్ డేస్’ సేల్‌ను ప్రారంభించనుంది. అయితే, ఇది ఆరు రోజులు మాత్రమే కొనసాగనుండగా, అమెజాన్ మాత్రం ఏకంగా నెల రోజులపాటు పాటు ఈ సేల్ నిర్వహించనుండడం విశేషం. గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ పేరుతో గతంలోనూ పలు సేల్స్ నిర్వహించినప్పటికీ అప్పుడు వారం రోజులకే పరిమితం చేసింది. వినియోగదారులకు అవసరమైన అన్నింటిని అందించడమే ఈ నెల రోజుల సేల్ లక్ష్యమని అమెజాన్ ఇండియా ఉపాధ్యక్షుడు మనీశ్ తివారీ తెలిపారు.

ఈనెల దసరా వేడుకలు చోటుచేసుకోవడం వల్ల సేల్ 17న ప్రారంభం కానుండగా, అమెజాన్ ప్రైమ్ సభ్యులకు మాత్రం ముందు రోజే అంటే అక్టోబరు 16నే అందుబాటులోకి రానుంది. ఈ ఫెస్టివ్ సీజన్‌లో స్థానిక దుకాణాల ద్వారా పలు రకాల స్థానిక ఉత్పత్తులను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురావాలని అమెజాన్ లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే, మొత్తం 900 కొత్త ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకొస్తోంది. తద్వారా అమెజాన్ గట్టి పోటీ ఇవ్వనుంది. అమెజాన్‌ ఇప్పటి వరకు హిందీ, ఇంగ్లిష్ భాషలకే పరిమితం కాగా, గత నెలలో కన్నడ, మలయాళం, తమిళం, తెలుగు భాషలను చేర్చింది. కొత్త వినియోగదారులకు ఆకర్షించడంలో భాషలు కీలకంగా మారుతాయని అమెజాన్ భావిస్తోంది. కాగా, అమెజాన్ ప్రత్యర్థి ఫ్లిప్‌కార్ట్‌లో ఇప్పటికే కన్నడ, తమిళం, తెలుగు, హిందీ భాషలు అందుబాటులో ఉన్నాయి. ఇందువల్ల వినియోగదారులను సులభంగా ఆకర్షించవచ్చు.

Tags :
|
|

Advertisement