Advertisement

భారీ శబ్దాలకు మిడతల పరార్

By: chandrasekar Thu, 28 May 2020 4:55 PM

భారీ శబ్దాలకు మిడతల  పరార్


కొద్ది రోజులుగా రాకాసి మిడతలు దేశాన్ని కలవరపరుస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో పంటకు నష్టం కలిగించిన ఈ దండు తెలంగాణ వైపుకు రావచ్చని అంచనా వేస్తున్నారు. ఈ మిడతలు తమ శరీర బరువుకు మించి ఆహారాన్ని తింటాయి. పంటలను నాశనం చేస్తాయి.

సుమారు 35 వేల మందికి సరిపడే ఆహారాన్ని ఇవి ఒక్క రోజులోనే హాంఫట్ చేసేస్తాయి. వీటిని తరిమికొట్టే విధానాలేవీ అందుబాటులో లేకపోవడం వల్ల రైతులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఇన్నాళ్లు శ్రమించి పండించిన పంట కళ్ల ముందే నాశమవుతుంటే కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.

grasshopper,leaves,for,heavy,sounds ,భారీ, శబ్దాలకు, మిడతల, పరార్, రోజులుగా


రైతులు మాత్రం మిడతల దండును తరిమికొట్టేందుకు సరికొత్తగా ప్రయత్నించారు. పెళ్లిల్లో ఉపయోగించే డీజే వాహనంతో మిడతలను తరిముతున్నారు.డీజే స్పీకర్ల నుంచి వెలువడే భారీ శబ్దాలకు ఆ మిడతలు తోక ముడవక తప్పలేదు. ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీ పోలీస్ అధికారి రాహుల్ శ్రీవాస్తవ ట్వీట్ ఇప్పుడు వైరల్‌గా మారింది.

ఈ మిడతలను తరిమేందుకు డీజే స్పీకర్లే కాకుండా చప్పట్లు, పెద్ద పెద్ద శబ్దాలు కూడా చేయొచ్చని ఆయన తెలిపారు. గత 26 ఏళ్లల్లో ఎన్నోసార్లు ఈ మిడతల దండు మన దేశంలోకి వచ్చాయి. కానీ, ఇంత భారీ సంఖ్యలో దాడి చేయడం ఇదే తొలిసారని నిపుణులు చెబుతున్నారు. ఈ దండు ఇప్పుడు తెలంగాణ వైపుకు వస్తున్న నేపథ్యంలో ఈ ఐడియాతో పంటలను రక్షించుకోవచ్చు.

Tags :
|
|
|

Advertisement