Advertisement

వనపర్తి జిల్లా లో మిడతల దండు రైతులు ఆందోళన

By: chandrasekar Fri, 14 Aug 2020 3:52 PM

వనపర్తి జిల్లా లో మిడతల దండు రైతులు ఆందోళన


మన దేశంలో మహారాష్ట్ర, ఇతర రాష్ట్రాలల్లో పంటలను నాశనం చేసిన మిడతల దండులో ఓ గుంపు తాజాగా వనపర్తి జిల్లాలోకి ప్రవేశించినట్లు గుర్తించారు. ముందుగా వీటిని వనపర్తి జిల్లా అమరచింత మండలం దీప్లా నాయక్ (చంద్రప్ప నాయక్) తండాలోని వ్యవసాయ పొలంలో గుర్తించారు. ఇవి పంట పొలాల్లో పంటలపై దాడి చేసి నాశనం చేయడాన్ని రైతులు గుర్తించారు.

మొక్క జొన్న పంటపొల్లాలో ఈ మిడతల దండు దాడి చేసి నాశనం చేస్తుంది. జొన్న చేను ఆకులను తింటూ స్థానికులకు కనిపించాయి. రాజస్థాన్, మహారాష్ట్ర రాష్ట్రాలలో పంటలను నాశనం చేస్తున్న మీడతల దండులోని ఓ గుంపు తెలంగాణలోకి వచ్చి వింటుందని అనుమానాలు వ్యక్తంచేశారు. వీటివల్ల సాగు చేసిన పంటలన్నీ నాశనం అవుతాయని ఆందోళన చెందుతున్నారు.

దీంతో ప్రత్యక్షంగా అమరచింత మండలం చంద్రప్పతాండలో ని వ్యవసాయ పొలాలలో రైతులు వేసుకున్న జొన్న చేనులో మిడతలు ఏకదాటిగా దాడి చేస్తు నాశనం చేస్తున్న దృశ్యాలు కనిపించాయి. అయితే మిడతలు రావడంతో తమ పంట పొలాల గురించి స్థానిక రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఆ ప్రాంత రైతులను వ్యవసాయ విభాగం అధికారులు అప్రమత్తం చేశారు. మిడతలను తరిమి కొట్టేందుకు పెద్దగా శబ్దాలు చేయాలని రైతులకు సూచించారు.

Tags :

Advertisement