Advertisement

గ్రామ వాలంటీర్లకు షాకిచ్చిన ఏపీ ప్రభుత్వం..

By: Sankar Tue, 08 Dec 2020 3:50 PM

గ్రామ వాలంటీర్లకు షాకిచ్చిన ఏపీ ప్రభుత్వం..


గ్రామ, వార్డు వలంటీర్ల విషయంలో కీలక సర్కులర్ జారీ చేసింది ఏపీ ప్రభుత్వం. రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో వయోపరిమితి అధికంగా, అత్యల్పంగా ఉన్నవారు వలంటీర్లుగా పనిచేస్తున్నారని.. వారందరినీ వెంటనే తొలగించాలని ప్రభుత్వం జాయింట్‌ కలెక్టర్లను ఆదేశించింది.

గ్రామ, వార్డు వలంటీర్లుగా 18-35 ఏళ్ల మధ్యనున్న వారినే కొనసాగించాలని జిల్లాల జేసీలకు ప్రభుత్వం ఆదేశం ఇచ్చింది.18 ఏళ్ల లోపు.. 35 ఏళ్లు దాటిన వారిని విధుల నుంచి తప్పించాలని సూచించింది. ప్రభుత్వ ఆదేశంతో ప్రతి జిల్లాలోనూ వేల సంఖ్యలో గ్రామ, వార్డు వలంటీర్లు విధులకు దూరమవుతారంటూ ప్రచారం జరుగుతుంది. కానీ కేవలం పది మంది మాత్రమే నిబంధనలకు విరుద్దంగా రిక్రూట్మెంట్ జరిగిందంటున్నారు అధికారులు.

కాగా వైఎస్ జగన్ సీఎం అయినా తర్వాత ప్రభుత్వ పథకాలు ప్రతి ఇంటికి చేరడంకోసం ఈ గ్రామ వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేసి అర్హత కలిగిన నిరుద్యోగులను ఇంటర్వ్యూ ల ద్వారా గ్రామ వాలంటీర్లుగా నియమించారు..

Tags :
|

Advertisement