Advertisement

  • దేశీయ ఇన్నోవేటర్లను యాప్‌ డెవలపర్లను ప్రోత్సాహించనున్న ప్రభుత్వం

దేశీయ ఇన్నోవేటర్లను యాప్‌ డెవలపర్లను ప్రోత్సాహించనున్న ప్రభుత్వం

By: chandrasekar Tue, 07 July 2020 11:50 AM

దేశీయ ఇన్నోవేటర్లను యాప్‌ డెవలపర్లను ప్రోత్సాహించనున్న ప్రభుత్వం


కేంద్ర ప్రభుత్వం దేశ భద్రత, సమగ్రతకు భంగం కలిగించేలా వ్యవహరిస్తున్నాయని పేర్కొంటూ టిక్‌టాక్‌, యూసీ బ్రౌజర్‌ సహా 59 చైనా యాప్‌లపై నిషేధం విధించింది. ఇక దేశీయంగా యాప్‌ల రూపకల్పనను ప్రోత్సహించేందుకు నడుంకట్టింది. ప్రపంచస్థాయిలో ‘మేడిన్‌ ఇండియా యాప్‌'లను రూపొందించేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ‘ఆత్మనిర్భర్‌ భారత్‌ యాప్‌ ఇన్నోవేషన్‌ చాలెంజ్‌'ను ప్రకటించారు.

భారత యాప్‌ డెవలపర్లు, ఇన్నోవేటర్స్‌ను ప్రోత్సహించేందుకు ఈ చాలెంజ్‌ను ప్రారంభించారు. టెక్‌ సంస్థలు ఇందులో పాల్గొనాలని పిలుపునిచ్చారు. సోషల్‌ నెట్‌వర్కింగ్‌, ఆఫీస్‌ ప్రొడక్టివిటీ/వర్క్‌ఫ్రమ్‌హోమ్‌, ఈ-లెర్నింగ్‌, హెల్త్‌ అండ్‌ వెల్‌నెస్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌, న్యూస్‌, బిజినెస్‌, గేమ్స్‌ అనే ఎనిమిది క్యాటగిరీల్లో ఈ పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులను అందజేయనున్నారు.

‘యాప్‌ చాలెంజ్‌ రెండు పట్టాలపై నడుస్తుంది. వీటిలో మొదటిది ప్రస్తుతమున్న యాప్‌లకు ప్రోత్సహించడం, రెండోది కొత్త యాప్‌లను రూపొదించడం’ అని ప్రధాని వివరించారు. నాణ్యమైన యాప్‌లను గుర్తించే ప్రక్రియను వేగంగా చేపడుతామని, నెలరోజుల్లో ఈ ప్రక్రియ పూర్తవుతుందని చెప్పారు. వీటిని ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని తెలిపారు. దేశంలో కొత్త చాంపియన్లను తయారు చేసేందుకు ఆవిష్కర్తలకు అన్నివిధాలా చేయూతనందిస్తామన్నారు.

వ్యవసాయ, అనుబంధ రంగాల్లో సాంకేతికత వినియోగాన్ని పెంపొందించేందుకు స్టార్టప్‌, అగ్రి-ఎంటర్‌ప్రెన్యూర్లను ప్రోత్సహించాలని ప్రధాని మోదీ అభిప్రాయపడ్డారు. దేశంలో వ్యవసాయ పరిశోధనలు, విస్తరణ, వ్యవసాయ విద్యపై ఆయన శనివారం సమీక్ష నిర్వహించారు.

Tags :
|
|
|

Advertisement