Advertisement

కరోనా చికిత్స ఫీజుల వివరాలతో పట్టికలు

By: Dimple Thu, 13 Aug 2020 03:34 AM

కరోనా చికిత్స ఫీజుల వివరాలతో పట్టికలు

కరోనా చికిత్స ఫీజుల వివరాలను ఆస్పత్రిలోని కీలక ప్రదేశాల్లో ప్రదర్శించాలని ఆదేశించింది. కేవలం ట్రీట్‌మెంట్‌ ధరలు మాత్రమే కాదు పీపీఈ కిట్లు, ఖరీదైన మందుల ధరలను పేర్కొనాలని స్పష్టం చేసింది.కరోనా సంక్షోభం వేళ ప్రైవేట్ ఆస్పత్రులు దోపిడీకి పాల్పడుతున్నాయని ఇప్పటికే ఎన్నో ఆరోపణలు ఎదుర్కొంటున్నాయి. ప్రభుత్వం ప్రకటించిన ధరల కంటే అధిక సంఖ్యలో వసూలు చేస్తున్నారని విమర్శలున్నాయి. వందల రూపాయల మందులిచ్చి లక్షల్లో బిల్లులు పిండుతున్నారని రోగుల బంధువులు వాపోతున్నారు. ఇప్పటికే పలు ఆస్పత్రులపై ఫిర్యాదులు అందడంతో తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఈ క్రమంలో అధిక ధరలకు కళ్లెం వేసేందుకు, ప్రైవేట్ ఆస్పత్రులకు సంబంధించి తాజాగా మరోసారి మార్గదర్శకాలు ఇచ్చింది. ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులనే వసూలు చేయాలని స్పష్టం చేసింది.
కరోనా చికిత్స ఫీజుల వివరాలను ఆస్పత్రిలోని కీలక ప్రదేశాల్లో ప్రదర్శించాలని ఆదేశించింది. కేవలం ట్రీట్‌మెంట్‌ ధరలు మాత్రమే కాదు పీపీఈ కిట్లు, ఖరీదైన మందుల ధరలను పేర్కొనాలని స్పష్టం చేసింది. కరోనా చికిత్సలో ఉపయోగించే మందులను ఎమ్మార్పీ ధరకే అమ్మాలని మార్గదర్శకాల్లో పేర్కొంది. బాధితులు కోలుకున్నాక డిశ్చార్జి చేసే సమయంలో పూర్తి వివరాలతో బిల్లులు ఇవ్వాలని తెలిపింది. ప్రభుత్వ మార్గదర్శకాలను పాటించని ఆస్పత్రులపై కఠిన చర్యలు తీసుకుంటామని మరోసారి గట్టిగా హెచ్చరించింది తెలంగాణ సర్కార్.
కాగా, తెలంగాణలో కరోనా కేసుల ఉధృతి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1897 పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. వీటితో కలిపితే రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 84544కి చేరింది. కొత్తగా 9 మరణాలు నమోదు కాగా, రాష్ట్రంలో మొత్తం కరోనా సంఖ్య 654కి చేరింది. దేశంలో కరోనా మరణాల శాతం 1.99 ఉండగా... తెలంగాణలో అది 0.77 శాతంగా ఉంది. గడిచిన 24 గంటల్లో 1920 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కరోనా బారిన పడిన వారి కంటే వైరస్ నుంచి కోలుకున్న వారి సంఖ్య ఎక్కువగా ఉండటం ఊరట కలిగించే అంశం.రాష్ట్రంలో వైరస్ నుంచి కోలుకున్న వారి సంఖ్య 61294కి చేరింది. తెలంగాణలో కరోనా పేషెంట్ల రికవరీ రేటు 72.49గా ఉంది. దేశంలో రికవరీ రేటు 69.79తో పోలిస్తే.. రాష్ట్రంలో రికవరీ రేటు ఎక్కువగా ఉంది. ప్రస్తుతం తెలంగాణలో యాక్టివ్ కేసుల సంఖ్య 22596గా ఉంది. వీరిలో 15534 మంది హోం ఐసోలేషన్‌లో ఉన్నట్టు ప్రభుత్వం పేర్కొంది. నిన్న కొత్తగా 22972 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. దీంతో రాష్ట్రంలో నిర్వహించిన కరోనా పరీక్షల సంఖ్య 22972కు చేరింది.

Tags :
|
|

Advertisement