Advertisement

గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ కీలక సూచనలు

By: chandrasekar Mon, 13 July 2020 5:25 PM

గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ కీలక సూచనలు


తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్ కరోనా వైరస్‌ విజృంభిస్తున్న వేళ రాష్ట్ర కీలక సూచనలు చేశారు. శనివారం గవర్నర్ కూడా కరోనా టెస్టు చేయించుకున్నారు. ఆదివారం వచ్చిన రిపోర్టులో కరోనా నెగటివ్‌గా అని తేలింది. కానీ, కొంత మంది రాజ్ భవన్ సిబ్బందికి పాజిటివ్ అని వచ్చింది.

ఈ విషయాన్ని గవర్నర్‌ ట్విటర్‌ వేదికగా వెల్లడిస్తూ ప్రజలను సైతం ముందస్తు పరీక్షలు చేయించుకొని కరోనా బారిన పడకుండా జాగ్రత్త పడాలని కోరారు.

‘‘ఈ రోజు నేను కరోనా టెస్టు చేయించుకున్నా. నెగటివ్‌గా వచ్చింది. రెడ్ జోన్‌లో ఉన్నవారు, కరోనా బాధితులను కలిసిన వారు దయచేసి వీలైనంత తొందరగా కరోనా పరీక్షలు చేయించుకోండి. ముందస్తు పరీక్షలు చేయించుకోవడం వల్ల మనల్ని మనం కాపాడుకోవచ్చు. అంతేకాక, ఎదుటివారిని కూడా కాపాడిన వాళ్లమవుతాం. ఇందుకోసం ఏమాత్రం వెనకడుగు వేయకండి. మీరు పరీక్షలు చేయించుకొని ఎదుటివారిని అందుకు ప్రోత్సహించండి. ముఖ్యంగా ‘4టీ’ అనే సూత్రాన్ని పాటించండి.’’ అని సూచించారు.

4టీ అంటే టెస్ట్, ట్రేస్‌, ట్రీట్‌, టీచ్ అని గవర్నర్‌ తమిళిసై ట్వీటర్‌లో పేర్కొన్నారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై రాష్ట్ర గవర్నర్‌ సమీక్షలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. నిమ్స్ సహా కొన్ని ఆస్పత్రుల్లో కరోనా రోగులను, వైద్యులను కలిశారు. ప్రైవేటు ఆస్పత్రుల ప్రతినిధులతోనూ చర్చలు జరిపారు.

Tags :
|

Advertisement