Advertisement

  • ఇక నుంచి అక్కడ ప్రభుత్వ కార్యాలయాలలో జీన్స్ , టి షర్ట్స్ నిషేధం ..

ఇక నుంచి అక్కడ ప్రభుత్వ కార్యాలయాలలో జీన్స్ , టి షర్ట్స్ నిషేధం ..

By: Sankar Sat, 01 Aug 2020 3:01 PM

ఇక నుంచి అక్కడ ప్రభుత్వ కార్యాలయాలలో జీన్స్ , టి షర్ట్స్ నిషేధం ..



ఉద్యోగి అనగానే అందరికి ఇస్త్రీ చేసిన బట్టలు , మేడలో టై , షూస్ ఇవే గుర్తొస్తాయి ..అయితే ఇటీవల కాలంలో ట్రెండ్ మారింది ..ఎక్కువగా టి షర్ట్స్ , జీన్స్ అందులోనూ ఫెడెడ్ జీన్స్ వంటి వాటిని ఎక్కువగా ధరిస్తున్నారు ..అయితే మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్‌ డివిజన్‌లో ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు మర్యాదపూర్వకమైన, హుందాగా దుస్తులు ధరించి కార్యాలయానికి రావాలని ఆదేశాలు జారీ అయ్యాయి.

కార్యాలయానికి ‘ఫేడెడ్‌ జీన్స్‌, టీ షర్ట్‌’ వేసుకొని రాకుండా నిషేధం విధించారు. ఆఫీసులో తమ బ్యాధతలను నిర్వర్తించే సమయంలో డివిజన్‌కు చెందిన అధికారులు, ఉద్యోగులు అందరూ గౌరవప్రదంగా, హుందాగా దుస్తులు ధరించాలని డివిజనల్‌ కమిషనర్‌ ఎంబీ ఓఝా ఉత్తర్వులు జారీ చేశారు. ఆదేశాలను ఉల్లంఘిస్తే క్రమ శిక్షణా చర్యలు తీసుకోనున్నట్లు హెచ్చరించారు.

ఈ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడానికి జూలై 20న ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ అధ్యక్షతన వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా నిర్వహించిన సమీక్షా సమావేశానికి ఓ అధికారి టీ షర్ట్‌ ధరించి ధరించి హాజరయ్యారు. దీంతో ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులంతా గౌరవప్రదమైన సాంప్రదాయ దుస్తుల్లో విధులకు హాజరవ్వాలని ఆదేశించారు. ఎవరైనా దీనిని ఉల్లంగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.



Tags :
|

Advertisement