Advertisement

  • ప్రభుత్వం అమ్మఒడి పథకం నగదుపై ప్రైవేటు పాఠశాలలు కన్ను...

ప్రభుత్వం అమ్మఒడి పథకం నగదుపై ప్రైవేటు పాఠశాలలు కన్ను...

By: chandrasekar Fri, 11 Dec 2020 10:19 PM

ప్రభుత్వం అమ్మఒడి పథకం నగదుపై ప్రైవేటు పాఠశాలలు కన్ను...


ప్రభుత్వం గత ఏడాది నుంచి అమ్మఒడి పథకం అమలు చేస్తోంది. ఒకటి నుంచి 10వ తరగతి స్థాయి విద్యార్థులకు రూ.15వేలు తల్లుల ఖాతాల్లో వేస్తున్నారు. ఆన్‌లైన్‌ క్లాసులకు హాజరైన వారి డేటాను మాత్రమే అమ్మఒడి పథకానికి పంపుతామని, మిలిగిన వారిని గైర్హాజరులో చూపుతామని విద్యార్థుల తల్లిదండ్రులకు సందేశాలు పంపుతున్నాయి.

ఈ ఏడాది కరోనా కారణంగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు సక్రమంగా జరగలేదు. కొన్ని స్కూల్స్‌ మాత్రమే 8, 9, 10 తరగతుల వారికి ఆన్‌లైన్‌ క్లాసులు నిర్వహిస్తున్నాయి. కొన్ని ప్రైవేటు స్కూళ్లు 5, 6 తరగతులకు ఆన్‌లైన్‌ క్లాసులు మొదలుపెట్టాయి. తమ పిల్లలకు ఆన్‌లైన్‌ క్లాసులు అర్ధం కావడం లేదనే ఉద్దేశంతో ఇంటివద్దనే కొంత మందిని చదివిస్తున్నారు.

ప్రభుత్వం మరోసారి ఈ పథకంలో అర్హులైన వారికి రూ.15వేలు బ్యాంకు ఖాతాల్లో వేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసింది. పథకంలో వచ్చే డబ్బును ఫీజుల రూపంలో దండుకోవడంతోపాటు, అదనంగా తల్లిదండ్రులపై భారం మోపాలని ప్రయత్నిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ క్రమంలో విద్యార్థుల డేటాను అప్‌డేట్‌ చేయాలంటే ఆన్‌లైన్‌ క్లాసులకు హాజరు కావాల్సిందేనని ప్రైవేటు స్కూల్స్‌ ఆర్డర్స్ వేస్తున్నాయి.

Tags :
|
|

Advertisement