Advertisement

  • సర్కార్ సంచలన నిర్ణయం...ప్రభుత్వ ఉద్యోగులకు జీన్స్, టీషర్టులు బంద్...

సర్కార్ సంచలన నిర్ణయం...ప్రభుత్వ ఉద్యోగులకు జీన్స్, టీషర్టులు బంద్...

By: chandrasekar Sat, 12 Dec 2020 5:06 PM

సర్కార్ సంచలన నిర్ణయం...ప్రభుత్వ ఉద్యోగులకు జీన్స్, టీషర్టులు బంద్...


సెక్రటేరియట్‌తో పాటు ప్రభుత్వ ఆఫీసులలో పనిచేసే ఉద్యోగులు జీన్స్, టీషర్ట్ ధరించి విధులకు హాజరుకాకూడదని మహారాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు డ్రెస్​ కోడ్ నిబంధనలను తెలుపుతూ ఓ సర్కులర్ జారీ చేసింది. గవర్నమెంట్ ఉద్యోగులతో పాటు కాంట్రక్ట్ ఉద్యోగులకు కూడా ఈ నిబంధనలు వర్తిస్తాయని స్పష్టం చేసింది. ప్రొఫెషనల్‌గా ఉండేలా ఫార్మల్ దుస్తులు ధరించాలని చెప్పింది. మహిళా ఉద్యోగులు చీర, చుడీదార్, ప్యాంట్ షర్ట్‌పై దుపట్టా తప్పని సరిగా వేసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది.

కొందరు ఉద్యోగులు, సిబ్బంది తాము చేస్తున్న పనికి తగ్గ దుస్తులు ధరించడం లేదని దీనివల్ల ప్రజల్లో ఉద్యోగులను చులకన చూస్తున్నారని సర్క్యులర్‌‌లో తెలిపింది. ఉద్యోగులు అనువుకాని, శుభ్రతలేని దుస్తులు ధరించడం వల్ల దాని ప్రభావం పనిపైనా ప్రభావం చూపుతోందని అభిప్రాయపడింది. చేనేతను ప్రోత్సహించేందుకు వారంలో ఒకరోజు ఖాదీ దుస్తులు ధరించాలని సర్క్యులర్‌ జారీ చేసింది. మహిళా ఉద్యోగులైతే చీరలు, సల్వార్ చుడిదార్స్‌ కుర్తాస్‌, ట్రౌజర్‌ ప్యాంట్స్‌ ధరించొచ్చని పేర్కొంది. పురుష ఉద్యోగులు మాత్రం షర్ట్‌, ప్యాంట్స్‌ ధరించాలంది. బొమ్మలు, ఎంబ్రాయిడరీ వర్క్స్‌ ఉన్నవి, మరీ ముదురు రంగు ఉన్న చొక్కాలు కూడా ధరించరాదని మరీ ముఖ్యంగా జీన్స్‌, టీషర్ట్‌కు దూరంగా ఉండాలని తెలిపింది.

Tags :

Advertisement