Advertisement

రవాణాశాఖలో భారీగా పదోన్నతులు

By: Sankar Sun, 06 Dec 2020 9:02 PM

రవాణాశాఖలో భారీగా పదోన్నతులు


తెలంగాణ రవాణా శాఖలో భారీగా పదోన్నతులు కల్పించింది ప్రభుత్వం... తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్ట మొదటిసారిగా ఇంత సంఖ్యలో పదోన్నతులు కల్పించడం ఇదేతొలిసారి అని చెబుతున్నారు అధికారులు...

రాష్ట్రవ్యాప్తంగా 87 మంది అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్లకు మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ లుగా ప్రమోషన్ కల్పించింది తెలంగాణ సర్కార్... ప్రమోషన్లు పొందినవారిలో ఐదో జోన్‌లో 28 మంది ఉండగా... ఆరో జోన్‌లో 59 మంది ఉన్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది ప్రభుత్వం..

కాగా, 2013 సంవత్సరం నుంచి పదోన్నతుల కోసం ఎదురుచూస్తున్నారు ఎఎంవిఐలు.. ప్రభుత్వం ఉత్తర్వులతో వారికి గుడ్‌న్యూస్ చెప్పింది.. ఇక, ఎన్నో సంవత్సరాల తర్వాత ప్రమోషన్స్ ఇవ్వడంపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఎంవీఐలు.

Tags :
|

Advertisement