Advertisement

  • తెలంగాణ ప్రభుత్వం దసరా బహుమతిగా డబుల్ బెడ్‌రూం ఇళ్ల కేటాయింపు

తెలంగాణ ప్రభుత్వం దసరా బహుమతిగా డబుల్ బెడ్‌రూం ఇళ్ల కేటాయింపు

By: chandrasekar Mon, 26 Oct 2020 1:29 PM

తెలంగాణ ప్రభుత్వం దసరా బహుమతిగా డబుల్ బెడ్‌రూం ఇళ్ల కేటాయింపు


తెలంగాణ ప్రభుత్వం దసరా బహుమతిగా లబ్ది దారులకు డబుల్ బెడ్‌రూం ఇళ్ల కేటాయించనుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణం ప్రారంభించింది. అయితే పేదలకు తెలంగాణ ప్రభుత్వం దసరా బహుమతి అందించనుంది. సకల వసతులతో నిర్మించిన డబల్ బెడ్‌రూమ్ ఇండ్లను ఈరోజు ప్రారంభించనుంది. ఇందువల్ల పేద ప్రజలకు లబ్ది చేకూరనుంది.

దసరా బహుమతిగా హైదరాబాద్‌లోని ఇవాళ ఉదయం మూడుచోట్ల డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లను మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు. ఉదయం 10 గంటలకు జియాగూడలోని 840 ఇండ్లను, 11 గంటలకు గోడే కి కబర్‌లో 192 ఇళ్లను, 11.30 గంటలకు కట్టెల మండిలో 120 డబల్ బెడ్‌రూమ్ ఇండ్లను ప్రారంభిస్తారు. మొత్తంగా మూడు చోట్లా కలిపి 1,152 ఇళ్లను లబ్దిదారులకు కేటాయించనున్నారు.

ఇందుకోసం ఇళ్ల ప్రారంభోత్సవంలో ఉపసభాపతి టీ పద్మారావు, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్‌, ప్రశాంత్‌రెడ్డి, మేయర్ బొంతు రామ్మోహన్ పాల్గొననున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అర్హులైన పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుందని మంత్రి కేటీఆర్ అన్నారు. త్వరలోనే మిగతా ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి పేదలకు పంపకాలు చేపడతామని మంత్రి కేటీఆర్ చెప్పారు.

Tags :

Advertisement