Advertisement

  • చైనా యాప్ సంస్థలకు 79 ప్రశ్నలు సంధించిన భారత ప్రభుత్వం

చైనా యాప్ సంస్థలకు 79 ప్రశ్నలు సంధించిన భారత ప్రభుత్వం

By: chandrasekar Mon, 13 July 2020 5:19 PM

చైనా యాప్ సంస్థలకు 79 ప్రశ్నలు సంధించిన భారత ప్రభుత్వం


59 చైనా యాప్‌లపై నిషేధం విధించడం తెలిసిందే. గాల్వన్ లోయలో ఉద్రిక్తత అనంతరం చైనాకు డిజిటల్ సర్జికల్ స్ట్రైక్స్‌తో కేంద్ర ప్రభుత్వం బుద్ధి చెప్పింది. తమకు అవకాశం ఇవ్వాలని

టిక్‌టాక్‌ సహా సంబంధిత చైనా యాప్ సంస్థలు, యాజమాన్యాలు కోరడంతో భారత ప్రభుత్వం వారికి 79 ప్రశ్నలు సంధించింది.

దీనిపై ఆ కంపెనీ యాజమాన్యాలు ఇచ్చే సమాధానాలపై నిషేధాన్ని తొలగించాలా లేక కొసాగించాలా అనేది ఆధారపడి ఉంటుందని కేంద్ర ఎలక్ట్రానిక్స్, సాంకేతిక మంత్రిత్వ శాఖ తెలిపింది

‘నిర్ణీత గడువులోగా అంటే జులై 22లోగా నిషేధానికి గురైన కంపెనీల యాజమాన్యాలు మా ప్రశ్నలకు స్పందించని పక్షంలో శాశ్వతంగా ఆయా చైనా యాప్స్‌పై నిషేధం కొనసాగుతుంది.

సరైన సమాధానాలు వచ్చిన పక్షంలో అందుకు సంబంధించిన యాప్స్‌పై ప్రత్యేక కమిటీ వేసి పునరాలోచన చేయనున్నట్లు’ ఆ శాఖ అధికారులు వెల్లడించారు. భారత్ యూజర్లకు అప్‌లోడ్ చేసిన 16 మిలియన్ల వీడియోలను, ప్రపంచ వ్యాప్తంగా 49 మిలియన్ల వీడియోలను టిక్ టాక్ తొలగించింది.

యాప్ తొలగించడంతో తమ డేటాకు సంబంధించి భారత్ నుంచి 302 రిక్వెస్ట్స్‌, అమెరికా నుంచి 100 వరకు యూజర్ రిక్వెస్ట్స్ వచ్చాయని కొన్ని రిపోర్టులున్నాయి. అయితే యూజర్ల డేటాను తాము తొలగించలేదని టిక్‌ టాక్ అధికార ప్రతినిధి తెలియ చేసారు.

Tags :

Advertisement