Advertisement

  • ప్రముఖ సోషల్ మీడియా ట్విట్టర్ కు వార్నింగ్ ఇచ్చిన భారత ప్రభుత్వం

ప్రముఖ సోషల్ మీడియా ట్విట్టర్ కు వార్నింగ్ ఇచ్చిన భారత ప్రభుత్వం

By: chandrasekar Fri, 23 Oct 2020 09:10 AM

ప్రముఖ సోషల్ మీడియా ట్విట్టర్ కు వార్నింగ్ ఇచ్చిన భారత ప్రభుత్వం


ప్రముఖ సోషల్ మీడియా ట్విట్టర్ కు భారత ప్రభుత్వం వార్నింగ్ ఇచ్చింది. ప్రస్తుతం భారత్ మరియు చైనాల మధ్య సరిహద్దు సమస్య తీవ్ర రూపం దాల్చిన సంగతి తెలిసిందే. లద్దాఖ్ ప్రాంతంలోని భారత భూభాగాన్ని చైనాలో భాగంగా చూపించినందుకు ట్విట్టర్ కు భారత ప్రభుత్వం గట్టి వార్నింగ్ ఇచ్చింది. భారత మ్యాప్ ను తప్పుగా ప్రెజెంట్ చేసినందుకు భారత ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. ఈ మేరకు ఐటీ సెక్రటరీ అజయ్ సావ్నే ట్విట్టర్ సీఈఓ జాక్ డోర్సీకు లేఖ రాశారు. సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ భారత భూభాగాన్ని జియో లోకేషన్ లో చైనాలో భాగంగా చూపింది. దీనిని భారత ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది.

భారత మ్యాప్ ను తప్పుగా ప్రెజెంట్ చేయడం పట్ల భారత సార్వభౌత్వానికి, సమగ్రతకు భంగం కలిగిస్తోంది అని ఎట్టి పరిస్థితిలో దీన్ని భరించేది లేదని స్పష్టం చేసింది ప్రభుత్వం. ఇలాంటి చర్యలు ట్విట్టర్ పై గౌరవాన్ని తగ్గించడంతో పాటు భారతదేశ సార్వభౌమత్వానికి, ఐక్యతకు, సమగ్రతకు భంగంగ కలిగిస్తుంది అని లేఖలో రాశారు. అదే సమయంలో లేహ్ లోని హెడ్ క్వార్టర్స్, లద్దాఖ్ రెండూ జమ్మూ కశ్మీర్ లో భాగం అని జమ్మూ కశ్మీర్ భారతదేశంలో భాగం అని స్పష్టం చేశాడు సావ్నే. భారత ప్రభుత్వ లేఖపై స్పందించిన ట్విట్టర్ అధికార ప్రతినిధి ప్రభుత్వ లేఖను గౌరవిస్తున్నాం అని అందులోని అంశాలను స్వీకరిస్తున్నాం అని తెలిపారు. మ్యాప్ ను మార్పులు చేయాల్సి వుంది.

Tags :
|

Advertisement